ముఖ అందాన్ని రెట్టింపు చేసేది కళ్లు. అయితే కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు అందానికి అడ్డంగా మారుతాయి. కనీసం 10 మందిలో ఆరుగురికి ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్య సమస్యల కారణంగా ఈ నల్లని వలయాలు వస్తుంటాయి. ఈ వలయాలు తొలగించాలంటే.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో మాయం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
స్పూన్ గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి కళ్లకు మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే కళ్ల కింద నల్లటి వలయాలు క్రమేనా తగ్గుముఖం పడుతాయి. అలానే కొన్ని చుక్కల గ్లిసరిన్‌లో కొద్దిగా నారింజ రసాన్ని కలిపి కంటి కింద రాసుకోవాలి. ఆపై 20 నిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన నల్లని వలయాలే కాదు.. కళ్లు కూడా కాంతివంతంగా కనిపిస్తాయి.
పచ్చి బంగాళ దుంపతో జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను నల్లటి వలయాలకు రాసుకుంటే ఫలితం ఉంటుంది. బంగాళదుంపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి మించిన మరో వైద్యం లేదు. కనుక తప్పక బంగాళదుంపను వాడడండి.
కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేయడంలో దోసకాయ బాగా పనిచేస్తుంది. దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వాటిని కళ్లపై పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత తీసి చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.