Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుస్తులపై ఆ మరకలను తొలగించే పెట్రోల్..

దుస్తులపై ఆ మరకలను తొలగించే పెట్రోల్..
, బుధవారం, 10 ఏప్రియల్ 2019 (14:23 IST)
మన శరీరానికి చిన్నపాటి గాయం తగిలినప్పుడో, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో దుస్తులకు రక్తపు మరకలు అంటుతాయి. ఆ మరకలు ఆరినట్లయితే, అవి కాస్త మొండి మరకలుగా మారి ఎంత ఉతికినా పోవు. ఈ చిట్కాలు పాటిస్తే ఆ మరకలను పూర్తిగా మాయం చేయవచ్చు. 
 
* మరక పడిన 10-15 నిమిషాల్లోనే ఉప్పులో చల్లని నీటిని కలిపి, ఆ పేస్ట్‌ను మరకలపై నేరుగా రుద్దాలి. ఆరిపోక ముందే ఉతికేస్తే మరకలు పోతాయి.
 
* వంట చేసే సమయంలో దుస్తులపై నూనె, ఇతర మరకలు పడుతుంటాయి. మరక పడిన వెంటనే డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌, వాషింగ్‌ డిటర్జెంట్లను నేరుగా నూనె మరకల మీద వేసి రుద్దితే మరకలు తొలిగిపోతాయి.
 
* మొండి మరకలు సులభంగా పోవాలంటే.. మరకలు పడిన చోట కాస్తంత పెట్రోల్ వేసి రుద్దాలి. ఆ తర్వాత ఉతికితే మరకలు పూర్తిగా తొలిగిపోతాయి. ఆపై మామూలుగా సబ్బుతో ఉతకాలి. దీంతో మీ డ్రెస్‌ మీద మరక పడినట్టు కూడా తెలియదు.
 
* బట్టలపై పడిన ఇంకు మరకలు పోవాలంటే వాటిని మిథేల్ ఆమ్లం ఉత్పత్తుల్లో నానబెట్టాలి. ఆ తర్వాత బట్టలపై ఉన్న మరకలు పూర్తిగా తొలిగిపోయే వరకు డిటర్జెంట్‌ నీటిలో నానబెట్టాలి. మరక మీద రబ్‌ చేస్తూ ఉతికితే మరక మాయం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లం టీ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?