కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అలాంటి కరివేపాకుతో రసం తయారు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. కరివేపాకు రసం తెల్ల రక్త కణాలను బలపరుస్తుంది. ఈ రసాన్ని సూప్‌గా కూడా తాగవచ్చు.
కరివేపాకు రసానికి కావలసిన పదార్థాలు - కరివేపాకు - ఒక కప్పు, పసుపు - 3 టీస్పూన్లు, మిరియాలు, జీలకర్ర - ఒక్కొక్క టీస్పూన్, చింతపండు - ఒక చిన్న బంతి, పసుపు పొడి - అర టీస్పూన్, నెయ్యి - కొద్దిగా, ఆవాలు, ఉప్పు - అవసరం.
తయారీ విధానం:
కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, జీలకర్రను పేస్ట్‌గా రుబ్బుకోవాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో కరిగించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని బాణలి వేడయ్యాక పోపు పెట్టి రసంలా రెడీ అయ్యాక దించేయాలి. అంతే కరివేపాకు రసం రెడీ.