Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహానికి ముఖ్యాంశాలివే..?

గృహానికి ముఖ్యాంశాలివే..?
, బుధవారం, 28 నవంబరు 2018 (12:02 IST)
ప్రతి ఒక్కరి మనసులో వారికో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. ఈ కోరిక నెరవేరడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. చివరికి ఆ ప్రయత్నాలన్నీ ఫలించి ఇంటి నిర్మాణానికి వచ్చేస్తారు. కానీ, వాస్తు పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు. ఆ కట్టడం పూర్తి కాకుండానే ఏవేవో ఇబ్బందులు, అనారోగ్యాలు పాలవుతుంటారు. వాస్తు ప్రకారం ఇంటి కట్టడానికి ఈ చిట్కాలు పాటిస్తే.. వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అవేంటే పరిశీలిద్దాం...
 
1. గృహం సమచతురస్రంగా ఉన్నచో ధన హాని.
2. ఇంటి యొక్క శిరోభాగం పల్లంగా లేదా పల్లకీ పంపుగా ఉంటే.. అనారోగ్య బాధలు ఉంటాయి. 
3. గృహానికి తగినన్ని స్తంభాలు లేకున్నా దీర్ఘవ్యాధులు, సంతాన నష్టం తధ్యం. 
4. ఇంటికి పశ్చిమ భాగాన లేదా దక్షిణ భాగాన కాలువ, నది ఉన్నచో.. రోగ బాధలు, ఆకస్మిక ఉపద్రవాలు కలుగుతాయి. 
5. తమ ఇంటి ఆవరణలోని ఇతరుల ఇళ్లనుండి గానీ, వీధిలో నుండి గానీ నీరు ప్రవహించేటట్లయితే శతృభయం, కలహాలు ఏర్పడుతాయి. 
6. ద్వారం యొక్క తలుపులు శిధిలమై ఉన్నా, జీర్ణావస్థలో ఉన్నా, ద్వారాలకు తలుపులు లేకున్నా దీర్ఘవ్యాధి సూచితమగుచున్నది. 
7. గృహగర్భం నాలుగు హస్తములకు తక్కువగా ఉండరాదు. ఇది రోగ బాధకు, ధన నష్టానికి సూచిక. 
8. అట్లే నాలుగు హస్తాలకు మించినచో ధనహాని, పశుహాని, శిశునాశనం. సరిగ్గా నాలుగు హస్తాలుండాలి. 
9. గృహావరణంలో తాటి చెట్లు ఉన్నచో భూత ప్రేత పిశాచాది భయం. 
10. పలుదిక్కుల కేంద్ర బిందువుగా ఇల్లు నిర్మించరాదు.
11. ద్వారానికి పై భాగాన ఇంకో ద్వారం పెట్టినచో ధనక్షయం. 
12. గృహం లోపం ప్రతిధ్వనులు కలుగరాదు. అది ఆ గృహంలో నివశించువారికి ఆయుర్దాయ క్షీణత. 
13. మూడు దూలాలతో ఇల్లు నిర్మించినచో రోగభయం. ఇతరుల గృహాల వెన్నుపోటు, గృహ యజమానికి మృత్యు భయాన్ని కల్గిస్తుంది. 
14. దూలం క్రింద కిటికీ ఉన్నట్లయితే.. సుఖహీనత కలుగుతుంది. 
15. మెుత్తం శూల దోషం లేకుండా ఉన్న ద్వారాలు, కిటికీలు, అలమార్లు సకల ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (28-11-2018) దినఫలాలు : విద్యార్థినుల మెుండితనం...