Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపు .. నిర్మలమ్మ

ఆత్మనిర్భర భారత్‌ :  రైతుల ఆదాయం రెట్టింపు .. నిర్మలమ్మ
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:33 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతి ఒక్కరూ కోటి ఆశలు పెట్టుకున్నారు. ‘నెవర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం కొగసాగుతోంది.
 
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని కీలక అంశాలను పరిశీలిస్తే, 
* ఆత్మనిర్భర భారత్‌ :  రైతుల ఆదాయం రెట్టింపు
* 6 సంవత్సరాలకుగాను  64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం
* నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 
 
కాగా, చరిత్రలో తొలిసారి పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌,  మేడ్‌ఇన్‌ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2021-22 : కరోనా కష్టకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం...