Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బడ్జెట్ 2021: ఆరోగ్య రంగానికి కేటాయింపులు అవసరం..

బడ్జెట్ 2021: ఆరోగ్య రంగానికి కేటాయింపులు అవసరం..
, బుధవారం, 27 జనవరి 2021 (11:20 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఫిబ్రవరి-1న సమర్పించనున్నారు. ఇది మోడీ ప్రభుత్వ రెండవ టర్మ్ లో మూడవ బడ్జెట్. బడ్జెట్ సెషన్ మొదటి దశ జనవరి 29 న ప్రారంభమై ఫిబ్రవరి 15 తో ముగుస్తుంది. బడ్జెట్ యొక్క రెండవ సెషన్ మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు నడుస్తుంది. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ జనవరి 29 న ప్రారంభం అవుతుంది.
 
కరోనా పుణ్యంతో లాక్ డౌన్ కాలంలో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయినప్పటికీ ఈ సంవత్సరం కాపెక్స్ బడ్జెట్‌లో సుమారు 1.55 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణీకుల రైళ్లు కూత పెట్టలేదు. గూడ్స్ చేరవేతకు సంబంధించి కొన్ని రైళ్లను మాత్రమే అధికారులు పట్టాలెక్కించారు. ఈ సమయంలో ట్రాక్ లు ఇతర పనులను పునరుద్ధరించడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టారు.
 
బిజినెస్ టుడే నివేదిక ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి మొత్తం రూ .1.80 లక్షల కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇందులో జిబిఎస్ 75000 కోట్ల రూపాయలు కాగా రైల్వే సమర్పించిన మొత్తం మూలధన వ్యయం మునుపటి సంవత్సరం బడ్జెట్ అంచనా కంటే 12.5 శాతం ఎక్కువ. కనీసం 1.70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదిస్తుందని భావిస్తోంది.
 
అలాగే బడ్జెట్ 2021లో కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి అధిక కేటాయింపు అవసరముంది. కరోనాతో భారత ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీత రెడ్డి సాయి అంటున్నారు. అందుచేత కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు అవసరమని ప్రీత రెడ్డి చెప్పారు.
 
COVID-19 మహమ్మారి ప్రజల జీవితాలను మార్చేసిందని, దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అధిక బడ్జెట్ కేటాయింపుల  ప్రాముఖ్యత ఎంతో వుంది. 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్' గా ప్రముఖ పాత్ర పోషించిన ఫార్మా రంగం ముఖ్యంగా రాబోయే బడ్జెట్‌లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలను ఆశిస్తున్నట్లు తెలిపింది.
 
నాథెల్త్ ప్రెసిడెంట్ మరియు అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీత రెడ్డి తెలిపారు. "ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం, నైపుణ్య అభివృద్ధికి, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి జాతీయ స్థాయి కార్యక్రమాలు, వైద్య కళాశాలల సంఖ్య పెరగడం, సమర్థవంతమైన పిపిపి నమూనాలు మరియు స్థానిక తయారీకి మరింత ప్రోత్సహకాలు వున్న అవసరాన్ని ఇది పునరుద్ఘాటించింది" అని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా అక్క భర్త లేక బాధపడుతోంది, ఆమె కోరిక తీర్చమన్న భార్య, ఆ తర్వాత?