Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75వేలకోట్ల రుణాలు

2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75వేల కోట్ల రుణాలను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మహిళల హుందాతనాన్ని కాపాడుతున్న శౌచాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 కోట

Advertiesment
Budget 2017-18
, గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:20 IST)
2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75వేల కోట్ల రుణాలను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మహిళల హుందాతనాన్ని కాపాడుతున్న శౌచాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు.  
 
ఇకపోతే.. సామాన్య ప్రజలు వైద్య ఖర్చులు భరించలేని స్థాయికి చేరుతుండటంతో కేంద్రం బడ్జెట‌లో దేశంలో 50కోట్ల మంది ప్రజలకు కేంద్రమే సాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జైట్లీ ప్రకటించారు. ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే 50కోట్ల మందికి ప్రభుత్వపరంగా ఆరోగ్య రక్షణ లభించనుంది. రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని ఓ కుటుంబానికి అందిస్తామని జైట్లీ ప్రకటించారు. 
 
బడ్జెట్ కీలకాంశాలను ఓసారి పరిశీలిస్తే.. 
* జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు
* 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు 
* నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి
* పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు
* పేదలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వచ్ఛ భారత్ అభియాన్. 
* రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు 
* 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే సర్కారు లక్ష్యం
* రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతున్నాం
* పంటలకు దిగుబడిని, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి
* ధాన్యం పప్పు దినుసుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం
* నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి
* పెట్టుబడులను పెంచుతూ, వృద్ధికి సహకరించేలా సంస్కరణలు
* రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు చేయడం గొప్ప విజయం 
* వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై దృష్టి 
* అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒకే యంత్రాంగం ఏర్పాటు
* మరో నాలుగేళ్లలో అన్ని గ్రామాలకూ పక్కా రహదారులు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Budget2018 : పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా