Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జుట్టు విరబోసుకుని ఆలయాలకు వెళ్తున్నారా? (video)

మహిళలు జుట్టును విరబోసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే జుట్టును విరబోసుకోవడం మంచిది కాదంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. వెంట్రుకలు, గోళ్లు అనేవి పాపాలను ప్రతీకలని.. అందుకే భగవంతునికి తల నీలాలిచ్

జుట్టు విరబోసుకుని ఆలయాలకు వెళ్తున్నారా? (video)
, గురువారం, 25 జనవరి 2018 (14:07 IST)
మహిళలు జుట్టును విరబోసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే జుట్టును విరబోసుకోవడం మంచిది కాదంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. వెంట్రుకలు, గోళ్లు అనేవి పాపాలను ప్రతీకలని.. అందుకే భగవంతునికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటారు.

తలంటు స్నానం చేసిన మహిళల జుట్టు విరబోసుకుని వుంటే సమస్త భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. అందుకే తలస్నానానంతరం చివరి ముడి వేయకుండా ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా సాధారణంగా కూడా జుట్టును విరబోసుకుని తిరిగినట్లైతే దుష్ట గ్రహాల ఆవహిస్తాయి. 
 
ఇంకా తలస్నానానంతరం జడని అల్లుకుని లేదా జుట్టు కొసలను ముడేసుకుని పూజ చేయడం లేదా దైవ దర్శనం చేయడం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆ విధంగా చేసినట్లైతే.. లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్టదేవి (దరిద్ర దేవి)కి ఆహ్వానం పలికినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కేశాలను విరబోసుకునే స్త్రీలకు మాత్రమే కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి  ఉంటుదని.. ఇది దేవేంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం.
 
బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అనే మహర్షి దేవతలకు ఇచ్చే హవిస్సుల్లో కొంతభాగం రాక్షసులకు కూడా ఇస్తున్నాడని తెలుసుకుని ఇంద్రుడు విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించివేశాడు. ఆ మూడు తలలు ఆడాపిచుకగా, కౌజు పక్షిగా, తిత్తిరి పిట్టగా మారిపోయాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. 
 
వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచి పెడతాడు. భూలోకంలో వుండే స్త్రీలకు రుత్రుక్రమం వంటి ఇబ్బందులు కూడా ఇంద్రుని వరం వల్లే కలిగినవే అంటారు. అందుకే కేవలం స్త్రీలు జుట్టు విరబోసుకోవడం నిషిద్ధమని పండితులు చెప్తున్నారు. విరబోసుకోవడం ద్వారా దుష్ట శక్తులు సులభంగా ఆవహించి.. కీడును కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర' మేడారం జాతర (వీడియో సాంగ్)