Publish Date: Wed, 14 Aug 2019 (13:40 IST)
Updated Date: Wed, 14 Aug 2019 (13:41 IST)
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యున్నత ''వీరచక్ర'' పురస్కారం దక్కనుంది. పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి, పాక్ ఆర్మీ చెరలో దాదాపు 60 గంటలు బందీగా ఉండి విడుదలైన అభినందన్‌కు వీరచక్ర గ్యాలెంట్రీ మెడల్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. అభినందన్‌కున్న అసమాన ధైర్యసాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని వీరచక్రతో అభినందించనుంది.
ఇకపోతే.. ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్ ఆ తర్వాత పాక్ ఆర్మీ చేతికి చిక్కారు. ఆ తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పాక్ ఆర్మీ అధికారులకు ఆయన సమాధానాలు ఇచ్చిన వీడియా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే అభినందన్ భారతదేశ హీరో అయిపోయారు. మార్చి 1న వాఘా సరిహద్దులో అభినందన్ అడుగుపెట్టిన సంగతి విదితమే.