Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహం నోటిలో ఆవు తల.. కాపాడిన రైతు.. వీడియో వైరల్

Advertiesment
సింహం నోటిలో ఆవు తల.. కాపాడిన రైతు.. వీడియో వైరల్
, శనివారం, 1 జులై 2023 (11:08 IST)
గోవు-సింహంల మధ్య ఫైట్ జరుగుతోంది. మరికొన్ని క్షణాల్లో సింహానికి గోవు ఆహారంగా మారబోతోంది. అయితే ఆ క్షణంలో గోవును ఓ వ్యక్తి కాపాడాడు. గోవుపై దాడిచేసిన ఆడసింహం దాని తలను గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నించింది. అది చూసిన ఆవుకు సొంతమైన రైతు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లి గోవును రక్షించాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో సింహం గోవు మెడపట్టుకుని చంపేందుకు ప్రయత్నించింది. 
 
ఆవు బాధతో విలవిల్లాడిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాని అరుపులు విన్న రైతు సింహాన్ని చూసి బెదరకుండా.. సాహసం చేశాడు. సింహంపై దాడి చేశాడు. 
 
సింహం బారి నుంచి తన గోవును కాపాడేందుకు చెయ్యెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కింద ఏమైనా దొరకుతుందేమోనని చూసి ఓ రాయిని తీసుకుని సింహాన్ని అదిలింటాడు. ఆ రైతును చూసి జడుసుకున్న సింహం ఆవును వదిలిపెట్టి పారిపోయింది. గోవు సింహం బారి నుంచి బయటపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటా ధరలకు రెక్కలు.. రూ.100 నుంచి రూ.120 వరకు..?