Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాయ్‌లెట్‌లో 7 గంటల పాటు చిరుత-శునకం.. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలట! (video)

టాయ్‌లెట్‌లో 7 గంటల పాటు చిరుత-శునకం.. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలట! (video)
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:27 IST)
Tiger_Dog
కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. టాయ్‌లెట్‌లో చిరుత-శునకం ఏడు గంటల పాటు గడిపాయి. కుక్కను చూసి చిరుత ప్లేసును మార్చుకుంది. బుధవారం దాదాపు ఏడు గంటల పాటు టాయ్‌లెట్‌లో చిరుత-శునకం గడిపిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు జంతువులను కర్ణాటకలోని బిలినెలే గ్రామ వాసులు కనుగొన్నారు. 
 
ఈ ఫోటోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. "ప్రతి కుక్కకు ఒక రోజు ఉంది. ఈ కుక్క చిరుతపులితో టాయిలెట్‌లో గంటల తరబడి చిక్కుకుపోయింది. అంతేగాకుండా సజీవంగా బయటపడింది. ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది..అని రాశారు. ఒకే గదిలో వున్నప్పటికీ కుక్కపై చిరుత పులి దాడి చేయలేదు. 
 
ఈ ఘటనపై రాఘవేంద్ర అనే అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. సాధారణంగా చిరుతపులులు జన సంచార ప్రాంతంలోకి వచ్చి దాడులకు పాల్పడుతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. శునకంతో గడిపినా.. దానికి దూరంగా చిరుతపులి గడిపిందన్నారు. ఏడు గంటల తర్వాత చిరుత తప్పించుకుని పారిపోయిందని.. శునకం జాగ్రత్తగా ప్రాణాలతో బయటపడిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. కరోనా కాలంలో జంతువులు కూడా ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. చిరుతపులి హీరో అని అందుకే కుక్కపై దాడి చేయలేదంటున్నారు. ఇంకా చిరుతకు నోబెల్ పురస్కారం ఇవ్వాలని చెప్తున్నారు. అంతేగాకుండా శునకం తెలివైందంటున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డ మాట విన్నారో.. చర్యలు తప్పవు : అధికారులకు మంత్రి వార్నింగ్