Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రిని చంపిన పార్టీలో వంగవీటి రాధ చేరడం ఏమిటి?: వంగవీటి నరేంద్ర

Advertiesment
తండ్రిని చంపిన పార్టీలో వంగవీటి రాధ చేరడం ఏమిటి?: వంగవీటి నరేంద్ర
, గురువారం, 14 మార్చి 2019 (11:10 IST)
వైకాపాకు రాజీనామా చేసిన రంగా తనయుడు వంగవీటి రాధా టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధాకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. 
 
రాష్ట్రాన్ని దెబ్బతీసే వ్యక్తులతో కలిసిన జగన్.. తన విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని వంగవీటి రాధ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా మారాలని.. ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని వంగవీటి రాధ అన్నారు. ప్రజలు తప్పకుండా వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్ష హోదా కట్టబెడతారని కామెంట్స్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను హత్య చేయించిన పార్టీలో ఆయన కుమారుడు రాధా చేరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధ చర్యతో రంగా అభిమానులంతా క్షోభకు గురయ్యారని, ఎవరూ సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. మీడియాతో వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, రంగా హత్యకు కారణం టీడీపీయేనని ఎవరిని అడిగినా చెబుతారని గుర్తు చేశారు. 
 
అలాంటి పార్టీలో రాధా చేరడం బాధను కలిగిస్తోందని అన్నారు. గతంలో రంగా సతీమణి చేసిన తప్పునే ప్రస్తుతం రాధా కూడా చేస్తున్నాడని విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకున్న రాధను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని నరేంద్ర అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ సాక్షిగా.. భాజపా-వైకాపా బంధాన్ని అంగీకరించిన వైకాపా నేత