Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం.. దేవ్ ముద్రిక అనే పేరుతో...

Advertiesment
Dev Mudrika
, బుధవారం, 11 జనవరి 2023 (12:46 IST)
Dev Mudrika
వజ్రం చాలా ఖరీదైన సంగతి తెలిసిందే. ఓ ఉంగరంలో 26వేల వజ్రాలు ఉన్నాయి. ఏకంగా 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి రికార్డు సృష్టించింది.. యూపీలోని ఓ జ్యువెలరీ షాప్. వివరాల్లోకి వెళితే.... యూపీలోని మీరట్ కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. 
 
పువ్వు ఆకారంలో ఉన్న ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి దేవ్ ముద్రిక అని పేరు పెట్టినట్లు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ తెలిపారు. ఇది వరకు ఓ సంస్థ 24వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందని చెప్పుకొచ్చారు. 
 
తొలుత సాఫ్ట్ వేర్ ద్వారా దేవ్ ముద్రిక డిజైన్ ను రూపొందించామన్నారు. తర్వాత కళాకారులతో తయారు చేయించామని తెలిపారు. రెండు వేళ్లకు పెట్టుకునే ఈ ఉంగరం ధర ఇంకా నిర్ణయించలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు బంధు పథకానికి సంబంధించిన 5 అంశాలు