Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ అమ్మను చంపుతున్నా... రెండేళ్ళ చిన్నారి ముందే తల్లిని నరికి...

Advertiesment
మీ అమ్మను చంపుతున్నా... రెండేళ్ళ చిన్నారి ముందే తల్లిని నరికి...
, మంగళవారం, 29 జూన్ 2021 (19:38 IST)
తిరుపతిలో సంచలనంగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్యతో గొడవతో అతి దారుణంగా నరికి చంపిన భర్తను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అభంశుభం తెలియని రెండేళ్ళ పాప ముందు ఆమె తల్లిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు తండ్రి.
 
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి స్వస్థలం చిత్తూరు జిల్లా రామసముంద్రం, కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డితో మూడేళ్ల క్రితమే వివాహమైంది. వీరికి రెండేళ్ళ కుమార్తె ఉంది. పనీపాటా లేకుండా జల్సాగే తిరిగే శ్రీకాంత్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు.
 
ప్రతిరోజు మద్యానికి డబ్బులు అడుగుతూ భార్యను ఇబ్బంది పెడుతుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆమెను కొట్టేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తించవచ్చని సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి తన భార్యను తీసుకుని తిరుపతికి వచ్చేశాడు.
 
తిరుపతి డిబిఆర్ ఆసుపత్రి సమీపంలో ఒక అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకుని ఉండేవారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరి గొడవ తారాస్థాయికి చేరడంతో వారంరోజుల క్రితమే అతి కిరాతకంగా ఆమెను తన కుమార్తె ముందు చంపి ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసులో ఉంచి తిరుపతిలోని రుయా ఆసుపత్రి వెనుక ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేసి కాల్చేశాడు. అత్యంత పాశవికంగా జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి విజయవాడ సమీపంలోని కోదాడ వద్ద నిందితుడిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.3,499 డేటా ప్లాన్... రోజుకు 3GB డేటా,100 ఎస్సెమ్మెస్‌లు