Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారా..? వీడియో వైరల్

Advertiesment
పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారా..? వీడియో వైరల్
, సోమవారం, 13 జనవరి 2020 (11:16 IST)
అవును పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారంటే.. షాక్ అవ్వాల్సిందే. టిక్ టాక్ ద్వారా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్లతో కూడిన ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు చూసేస్తున్నారు. తాజా వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన బ్యాగు నుంచి పచ్చి ఆకుకూరను బయటకు తీసి అలాగే నమిలి తినేసింది. 
 
ఈ తతంగాన్ని టిక్ టాక్ యూజర్ మొల్లీ మెక్‌గ్ల్యూ వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా "అయామ్ సో ఫ్రెష్" అనే సాంగ్ ప్లే చేశాడు. అది కాస్త వైరలై కూర్చుంది. వామ్మో... పచ్చి ఆకుకూరను ఎవరైనా ఇలా తింటారా అంటూ... ఆశ్చర్యపోతూ చాలామంది ఈ వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారు. 
 
ఈ వీడియోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వీడియోని మూడు రోజుల్లో 37 లక్షల మంది చూడగా, దీనికి 2.5లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 1900 మంది కామెంట్లు రాశారు. అదన్నమాట సంగతి. ఈ వీడియోను ఈ లింక్ ద్వారా ఓ లుక్కేయండి. 
 
https://www.tiktok.com/@molly.mcglew/video/6779376019519458566

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ లో రేవ్ పార్టీ : 20మంది యువతుల అరెస్ట్