Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం కురువృద్ధుడు సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు. ఆయన వయసు 89 యేళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆ

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత
, సోమవారం, 13 ఆగస్టు 2018 (09:41 IST)
లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం కురువృద్ధుడు సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు. ఆయన వయసు 89 యేళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 
గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది
 
'ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం' అని వైద్యులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆయన సోమవారం ఉదయం కన్నమూశారు. 
 
కాగా, 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కోల్‌కత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.  
 
1968లో సీపీఎంలో చేరిన చటర్జీ 10 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయన సీపీఎం పార్టీలో చేరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా చావుకు ఆ వ్యక్తే కారణం అమ్మా.. నీవు జాగ్రత్త : కొడుకు సూసైడ్