Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకంలో కుజ దోషముందా..? ఐతే భయపడనక్కర్లేదు.. ఇలా చేస్తే?

జాతకంలో కుజ దోషం వున్నట్లు జ్యోతిష్యులు చెప్పారా? ఐతే ఇలా చేయండి. కుజ దోష జాతకులు 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని నిష్ఠతో పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లేదా సహస్రనామ స్త

జాతకంలో కుజ దోషముందా..? ఐతే భయపడనక్కర్లేదు.. ఇలా చేస్తే?
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:23 IST)
జాతకంలో కుజ దోషం వున్నట్లు జ్యోతిష్యులు చెప్పారా? ఐతే ఇలా చేయండి. కుజ దోష జాతకులు 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని నిష్ఠతో పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లేదా సహస్రనామ స్తోత్రమ్ చదవాలి. 
 
అవసరమైతే.. కుజగ్రహ జపం, శాంతి హోమం జరిపించాలి. ఇంకా కుజ గ్రహ శ్లోకాన్ని ఏడు సార్లు లేదా గురుగ్రహ శ్లోకాన్ని 16సార్లు రోజూ పఠించాలి. నరసింహ స్వామికి ఆలయాల్లో కళ్యాణం జరిపించాలి. కందులు, ఎర్రని వస్త్రంలో వుంచి దానం చేస్తే కుజుడిని శాంతింపజేయవచ్చు. ఇంకా కనకపుష్య రాగం ఉంగరాన్ని ధరించాలి.
 
స్త్రీ లేదా పురుష జాతకాలలో కుజ గ్రహం 2, 4, 7, 8, 10, 12వ స్థానాల్లో వుంటే అది కుజ దోషంగా పరిగణించబడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ దోషమున్నట్లైతే వివాహం ఆలస్యం, దంపతులు విడిపోవడం జరుగుతుంది. జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే కుజ గ్రహ దోషముందని నిర్ధారించుకున్న పిమ్మటే కుజ శాంతికి ఉపక్రమించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే కుజుడు శత్రు, రోగ, రుణములకు, సహోదరులకు కారకుడు. కుటుంబ కలహాలు, కత్తుల వలన గాయాలు, శత్రుబాధలు, అవమానాలు, నుదురు, కండరములు. రక్తము పడుట, అంటువ్యాధులు, ఆపరేషన్లు, శిక్షలు పడుట మొదలగునవి జరిగినప్పుడు కుజబలం లోపించినట్లు గుర్తించాలి. అలాంటి తరుణంలో 
 
కుజ ధ్యానం: 
ప్రతప్త గాంగేయనిభం గ్రహేశం, సింహానస్థం కమలాసిహస్తమ్|
సురా సురైః పూజిత పాద యుగ్మం భౌమం దయాళుం హృదయేస్మరామి ||
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం 
కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహమ్ ||
 
అనే మంత్రాన్ని 21సార్లు పఠించాలి. 21 మంగళవారాలు కందులు దానమివ్వాలి. మంగళవారం రోజు చాలా నిష్ట నియమంగా వుండి, అభ్యంగన స్నానం చేయడం, రాత్రి భోజనం, సంభోగం, మంచంపై పరుండటం, స్త్రీలను హింసించడం, మాంసాహారం తినడం, దైవనింద వంటివి చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి నియమాలు పాటిస్తే కుజుడు శాంతించి జాతకుల బాధలను తగ్గిస్తాడని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే?