ఐదేళ్లు ఆమెతో కలిసున్నాడు... కాదనేసరికి ఆత్మహత్య చేస్కోబోయాడు... షమీ భార్య
ప్రముఖ క్రికెటర్ మహ్మద్ షమీ భార్య జహాన్ హాసన్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన ఆరోపణ చేసిందామె. తన భర్త
ప్రముఖ క్రికెటర్ మహ్మద్ షమీ భార్య జహాన్ హాసన్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన ఆరోపణ చేసిందామె. తన భర్త షమీకి గతంలో అతడి బంధువుల్లో ఓ అమ్మాయితో ఐదేళ్లుగా రిలేషన్ వున్నదనీ, ఆమెను పెళ్లాడాలని ప్రయత్నిస్తే ఆమె అందుకు నిరాకరించిందనీ, దాంతో అతడు ఆత్మహత్య యత్నం చేసినట్లు జహాన్ ఆరోపించింది.
మహ్మద్ షమీకి ఒక్కరు కాదు ఇద్దరు కాదు... చాలామంది మహిళలతో అక్రమ సంబంధం వున్నదంటూ ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతడికున్న సంబంధాలన్నీ కోర్టు ముందు ప్రవేశపెట్టి అతడిని కోర్టుకీడుస్తానంటూ ఆమె చెప్పారు.
అతడిని పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి తను అన్నింటికీ దూరమయ్యాయనీ, మోడలింగ్ రంగాన్ని వదిలేసానని చెప్పారు. చేసే ఉద్యోగం కూడా వదిలేసి ఇంటికే పరిమితమైనట్లు వెల్లడించారు. ఐనప్పటికీ మహ్మద్ షమీ తనను వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎలాగైనా వదిలించుకోవాలని మహ్మద్ షమీ చూస్తున్నాడనీ, ఐతే తను మాత్రం అంత తేలిగ్గా విడాకులు ఇవ్వననీ, చివరి వరకూ విడాకులు తీసుకోకుండా అతడి గురించి కోర్టులో నిజాలు మొత్తం లోకానికి చాటి చెపుతానంటూ జహాన్ చెపుతోంది.