Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్ప డైలాగ్ పేల్చిన రాజ్ నాథ్ సింగ్? పుష్కర్‌ అంటే ఫ్లవర్ కాదు ఫైర్

పుష్ప డైలాగ్ పేల్చిన రాజ్ నాథ్ సింగ్? పుష్కర్‌ అంటే ఫ్లవర్ కాదు ఫైర్
, బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (14:22 IST)
బన్నీ పుష్ప గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. "పుష్ఫ" సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వంద కోట్లు రాబట్టింది. 
 
పుష్పలో తగ్గేదే లే అనే డైలాగ్, శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్స్‌ను ఇతరులు అనుకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ల నుంచి మొదలు కొని పలువరు సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఇతరులు ఫిదా అయ్యారు. 
 
శ్రీవల్లి పాటను యూపీ గొప్పదనాన్ని చాటిచెప్పేలా కాంగ్రెస్ పార్టీ మార్పులు చేసి ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నోటి వెంట పుష్ప డైలాగ్ రావడం విశేషం.
 
స్వయంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నోట పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్‌ అనే డైలాగ్‌ వినిపించింది. ఉత్తరాఖండ్ ‌ఎన్నికల ప్రచారంలో ఈ సినిమాను ప్రస్తావిస్తూ.. సీఎం పేరు కూడా పుష్కర్ సింగ్ అంటూ పోలిక తెచ్చారు. గంగోలిహట్‌ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ పుష్ప డైలాగ్ చెప్పారు.
 
ఉత్తరాఖండ్‌లో కూడా ఒక పుష్కర్ ఉన్నారన్నారు రాజ్‌నాథ్‌. ఆయన చాలా సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారు. ఆయనలో పేరు పుష్కర్‌ అయితే ఫ్లవర్ అనుకోవద్దని, నిప్పు అన్నారు. ఆయనను ఎవరూ ఆపలేరు, తగ్గేదే లేదు అంటూ చమత్కరించారు రాజ్‌నాథ్ సింగ్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర విభజనపై ప్రధాని తప్పుచేశారు.. కె. కేశవరావు ఫైర్