Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19ఏళ్ల ప్రదీప్‌ మెహ్రా స్ఫూర్తి దాయక వీడియో_నెటింట్లో తెగ వైరల్‌

19ఏళ్ల ప్రదీప్‌ మెహ్రా స్ఫూర్తి దాయక వీడియో_నెటింట్లో తెగ వైరల్‌
, మంగళవారం, 22 మార్చి 2022 (11:45 IST)
Pradeep
ఉత్తరాఖండ్‌కు చెందిన 19ఏళ్ల ప్రదీప్‌ మెహ్రా స్ఫూర్తి దాయక వీడియో నెటింట్లో తెగ వైరల్‌ అవుతుంది. నోయిడాలో అర్థరాత్రి భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని రోడ్డుపై పరుగులు తీస్తున్న ప్రదీప్‌.. దర్శకుడు వినోద్‌ కాప్రి కంటపడ్డాడు. ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తానని ఆఫర్‌ ఇవ్వగా.. సున్నితంగా తిరస్కరించాడు ప్రదీప్‌. 
 
ఎందుకు పరుగులు తీస్తున్నావంటూ అడగగా.. ఆర్మీలో చేరేందుకు అంటూ చెప్పాడు. ఎక్కడకు వెళ్లాలని అని ప్రశ్నించగా.. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న బరోలాకు వెళ్లాలని తెలిపారు. 
 
రన్నింగ్‌ పొద్దున చేసుకోవచ్చుగా అని అడగ్గా.. తాను మెక్‌డొనాల్డ్‌లో ఉద్యోగం చేస్తున్నానని, ప్రొద్దున వంట చేసుకుని.. వెళ్లాలని సమాధానం ఇచ్చాడు. తల్లిదండ్రులు, ఇతర వివరాలు అడిగి.. మరోసారి ఇంటి దగ్గర వరకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పగా.. తన ప్రాక్టీస్‌కు ఆటంకం కలుగుతుందంటూ వెళ్లిపోయాడు.
 
ఈ వీడియోను వినోద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అతికొద్ది సమయంలో లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ ప్రదీప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 
 
కాగా, ఈ వీడియో చూసిన రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌.. అతని లక్ష్యాన్ని చేరుకునేందుకు తాను సాయపడతానని ముందుకు వచ్చారు. ప్రదీప్‌ జోష్‌ ప్రశంసనీయమని, రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో విజయవంతమయ్యేందుకు సాయపడతానని వీడియోను రీ ట్వీట్‌ చేస్తూ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలర్ట్: తుపానుగా మారే అవకాశం-ఏపీలో భారీగా వర్షాలు