Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాలకు పారిపోయిన నిత్యానంద.. కిడ్నాప్, రేప్ కేసు నమోదు కాగానే జంప్?

Advertiesment
విదేశాలకు పారిపోయిన నిత్యానంద.. కిడ్నాప్, రేప్ కేసు నమోదు కాగానే జంప్?
, శుక్రవారం, 22 నవంబరు 2019 (10:33 IST)
వివాదాస్పద బాబా నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద దేశం వదలి విదేశాలకు పారిపోయాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. నిత్యానంద తన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళలు ఇద్దరు పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు. 
 
మొత్తం నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి.. వారిని ఓ ఇంట్లో నిర్బంధించారని పోలీసులు తెలిపారు. వారిని బాల కార్మికులుగా మార్చి ఆశ్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు. ఆ నలుగురు పిల్లలకు విముక్తి కల్పించామని.. వారి వాంగ్మూలం ఆధారంగానే నిత్యానందపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసులో కీలక నిందితుడైన నిత్యానంద భారత్ తిరిగి రాగానే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
అయితే ఓ రేప్ కేసులో నిత్యానందపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడని అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి చెప్పారు. నిత్యానందకు ఎక్కడికి పారిపోయి ఉంటాడో తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను గుజరాత్ పోలీసులు కోరారు. అయితే హోంమంత్రిత్వ శాఖ మాత్రం గుజరాత్ పోలీసులు నంచి అధికారికంగా తమకెలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే నిత్యానందకు సబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ విధుల్లోకి మాజీ సైనికులు