Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ షాక్.. జగన్ పార్టీలో చేరనున్న మాజీ సీఎం కుమారుడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ తనయుడు రాంకుమార్ రెడ్డి బీజేపీకి షాకివ్వనున్నారు. ఆయన కాషాయం జెండా కాదనీ వైకాపాలో చేరనున్నారు. ప్రస్తుంత రాం కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష

Advertiesment
బీజేపీ షాక్.. జగన్ పార్టీలో చేరనున్న మాజీ సీఎం కుమారుడు?
, ఆదివారం, 5 ఆగస్టు 2018 (17:20 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ తనయుడు రాంకుమార్ రెడ్డి బీజేపీకి షాకివ్వనున్నారు. ఆయన కాషాయం జెండా కాదనీ వైకాపాలో చేరనున్నారు. ప్రస్తుంత రాం కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బీజేపీ హైకమాండ్ నియమించింది. అలా నియమించి 24 గంటలు పూర్తికాకముందే ఆయన కమలనాథులకు షాకిచ్చింది. 
 
ఆయన ఆదివారం ఏ ఒక్కరూ ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్‌తో ఆదివారం సమావేశమై తన రాకపై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెల్సిందే.
 
కాగా, 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రామ్ కుమార్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత భారత ఉపరాష్ట్రపతి, నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడుకి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2019లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేయాలని ఆయన భావిస్తూ వచ్చారు. 
 
కానీ, బీజేపీ, టీడీపీలు వేరుపడటంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఒకానొక సమయంలో టీడీపీ వైపు కూడా మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవిని ప్రకటించింది. కానీ, చివరకు ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది లీడర్ : మహిళా బెగ్గర్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే...