Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్డౌన్ మరో 2 వారాలు పొడగింపు .. ఆంక్షలు - సడలింపులు రాష్ట్రాల ఇష్టం

Advertiesment
లాక్డౌన్ మరో 2 వారాలు పొడగింపు .. ఆంక్షలు - సడలింపులు రాష్ట్రాల ఇష్టం
, గురువారం, 28 మే 2020 (11:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం అమల్లోవున్న నాలుగో దశ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదో దశ లాక్డౌన్ పొడగింపుపై వివిధ రకాల ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై కేంద్ర వర్గాలు స్పందిస్తూ, లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడగించే అవకాశాలు ఉన్నాయని సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జరిగే మన్ కీ బాద్ కార్యక్రమలో స్పష్టతనిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, లాక్డౌన్ సమయంలో ఆంక్షలు విధింపు, సడలింపులపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం దశలవారీగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాలుగు విడుతలు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5వ విడుత లాక్‌డౌన్‌లో ప్రధానంగా కేసులు పెరిగే ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారించనుంది. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కేవలం 11 నగరాల్లోనే 70 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, పుణె, థానె, ఇండోర్‌, జైపూర్‌, సూరత్‌ ఉన్నాయి. ఈ 11 నగరాల్లో కేసులను నియంత్రించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 5వ విడుత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశముందని తెలిపారు. 
 
ఈ ఐదో విడతలో ఆంక్షలు, సడలింపులపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును పూర్తిగా ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టనుంది. అదేసమయంలో కేంద్రం మాత్రం జాతీయ స్థాయి అంశాలపై దృష్టిసారించాలని భావిస్తోంది. అంటే పౌర విమాన, రైళ్ళ రాకపోకలపైనే దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో ఐదే విడత లాక్డౌన్‌లో సడలింపులు ఇచ్చే వాటిలో ప్రార్థనా మందిరాలను తెరువడానికి అనుమతి. అయితే భక్తులు నిర్ణీత దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల్సి ఉంటుంది. జిమ్‌లు (వ్యాయామశాలలు) తెరువొచ్చు. మాల్స్‌, సినిమాహాళ్లు, విద్యా సంస్థలపై ఆంక్షలు కొనసాగవచ్చు. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మరి కొంతకాలం నిషేధం కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామా తరహా దాడికి ప్లాన్ .. భగ్నం చేసిన సైనిక బలగాలు