Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసులకు షాక్ ఇచ్చిన సంజన గల్రానీ, అసలు ఏమైంది..?

Advertiesment
Kannada drugs case
, శనివారం, 3 అక్టోబరు 2020 (10:43 IST)
కన్నడ కథానాయిక సంజన శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈడీ రంగంలోకి దిగింది. సంజన గల్రానీ బ్యాంక్ ఖాతాల్నీ ఈడీ పరిశీలించింది. అయితే... ఈ ఖాతాలన్నీ చూసిన తర్వాత  ఖంగుతినడం ఈడీ వంతయింది. 
 
ఇదేంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే... సంజన ఖాతాల్లో కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయట. మరో విషయం ఏంటంటే... సంజనకు ఏకంగా 11 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులకు కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయి.
 
ట్విస్ట్ ఏంటంటే.. అరెస్ట్ అవ్వడానికి సరిగ్గా నాలుగు వారాల ముందు నుంచి సంజనా ఖాతాల్లో సొమ్ము.. ఇతర ఖాతాల్లోకి వరదలా పారిందట. అలా వరదలా పారిన డబ్బు ఎంతంటే అక్షరాల 3 కోట్లు అని సమాచారం. ఈ 3 కోట్లు గురించి ఈడీ అధికారులు సంజనను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై సంజనా పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు.
 
అయితే అధికారలు అడిగిన ప్రశ్నలకు సంజన, అస్పష్టంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ.. సంజన ఏం చెప్పిందంటే... డ్రగ్స్ అమ్ముకొని డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని.. సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్, ఫొటో షూట్స్ ద్వారా తను బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పిందట. మరి.. ఈ బెంగుళూరు బ్యూటీ ఈ కేసు నుంచి బయటపడుతుందో..? లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్‌ కు సెహ్వాగ్‌ బాబా ఆశీర్వాదం