పవన్ కళ్యాణ్‌పై జేపీ విమర్శలు : శ్రద్ధ లేని జనసేనాని
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలపై జేఎఫ్‌సీ లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది తొలుత తానేనని జయప్రకాష్ నారాయణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబట్టారు.