Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నా.. రావా..? నన్నొచ్చి తీసుకుపోవా..?

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వ్యభిచార దందా వెలుగు చూసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అన్యపున్నెం ఎరుగుని బాలికలను వ్యభిచార రొంపిలోకి దించేందుకు వారికి గ్రోత్ హార్మోన్

Advertiesment
yadagirigutta prostitute scam
, శనివారం, 4 ఆగస్టు 2018 (15:39 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వ్యభిచార దందా వెలుగు చూసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అన్యపున్నెం ఎరుగుని బాలికలను వ్యభిచార రొంపిలోకి దించేందుకు వారికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇలాంటి అకృత్యాలెన్నో వ్యభిచార నిర్వాహకులు చేశారు. చివరకు వారి పంటపండి.. వ్యభిచార గుహల్లో ఉన్న బాలికల్లో 15 మందికి పోలీసులు విముక్తి కల్పించారు.
 
యాదగిరిగుట్ట పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసుల వరుస దాడులతో వాటికి తాళాలువేసి నిర్వాహకులు పరారయ్యారు. సెక్స్‌ వర్కర్ల పడిగాపులు.. విటుల రాకపోకలతో సందడిగా ఉండే పట్టణంలోని గణేష్ నగర్‌ వంటి ప్రాంతాల్లో వేశ్యాగృహాలకు తాళాలతో నిర్మానుష్యంగా మారింది. పడుపు వృత్తి చేయించడం కోసం.. చిన్న పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పెంచడమే వారికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. 
 
మూడు రోజులుగా జరిపిన దాడుల్లో 15 మంది బాలికలకు విముక్తి కల్పించిన పోలీసులు 14 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేకాకుండా పాత కేసులను క్రోడీకరించి పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. అదేవిధంగా అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్న వేశ్యాగృహాలను సీఆర్‌పీ 133 ప్రకారం ఆర్డీవో ఉత్తర్వులమేరకు దాదాపు మూడేళ్లపాటు సీజ్‌ చేయించడానికి చర్యలు చేపడుతున్నారు. 
 
అంతేనా, ఐసీడీఎస్‌ జిల్లా అధికారి శారద ఆధ్వర్యంలో వ్యభిచార గృహాల్లోని పిల్లలకు విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను సేకరించారు. ఈ పాఠశాలలో దాదాపు 40 మంది విద్యార్థుల్లో 30 మంది వరకు బాలికలే ఉన్నారు. అయితే ఇదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 15 మంది బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. 
 
వీరిలో అసలు విద్యార్థులు ఎవరో.. వ్యభిచార గృహాల్లో నివశించే బాలికలు ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణా వసతి గృహంలో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నాన్నా రావా.. నన్నొచ్చి తీసుకునిపోవా అంటూ ఎదురు చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్మెట్ ధరించలేదేంటి అన్నందుకు పోలీసులను బూతులు తిట్టిన మహిళ