Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర - హర్యానాల్లో కమల వికాసం : ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్ర - హర్యానాల్లో కమల వికాసం : ఎగ్జిట్ పోల్స్
, సోమవారం, 21 అక్టోబరు 2019 (20:10 IST)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఆ తర్వాత పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అన్ని సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో తిరిగి కాషాయ జెండా విజయకేతనం ఎగురవేస్తుందని తేల్చాయి. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.
 
ఈ ఫలితాల వివరాలను పరిశీలిస్తే, 
మహారాష్ట్ర (288 సీట్లు)
టైమ్స్ నౌ : బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు.
ఇండియా టుడే : బీజేపీకి 109-124 స్థానాలు, శివసేనకు 57-70, కాంగ్రెస్‌కు 32-40, ఎన్సీపీ 40-50, ఇతరులకు 22-30 సీట్లు.
రిపబ్లిక్ టీవీ : బీజేపీకి 135-142, శివసేనకు 81-88, కాంగ్రెస్ పార్టీకి 20-24, ఎన్సీపీకి 30 - 35 స్థానాలు, ఇతరులకు 8 - 12 స్థానాలు. 
సీఎన్ఎన్ న్యూస్ 18 : బీజేపీకి 243 స్థానాలు, కాంగ్రెస్‌కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు.
ఏబీపీ న్యూస్ సి.ఓటర్ : బీజేపీకి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు.
న్యూస్ 24 : బీజేపీకి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు.
 
హర్యానా (88 సీట్లు)
టైమ్స్ నౌ : బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు.
రిపబ్లిక్ : బీజేపీకి  52 -63 స్థానాలు, కాంగ్రెస్‌కు 15 - 19 స్థానాలు, జేజేపీకి 5 - 9 స్థానాలు, ఐఎన్ఎల్‌డీ 0 - 1 స్థానం, ఇతరులకు 7 - 9 స్థానాలు.
న్యూస్ ఎక్స్ : బీజేపీకి 75 - 80 స్థానాలు, కాంగ్రెస్ 9 - 12 స్థానాలు, ఇతరులకు 1 - 3 స్థానాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాగనీటి పనుల బిల్లులు సకాలంలో చెల్లింపు.. మంత్రి పెద్దిరెడ్డి