Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా బెడ్రూం తలుపులు తెరచి పడుకోమన్నారు... ఇంటి చుట్టూ ఎర్రటి వస్త్రాన్ని కట్టారు...

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేందుకు మావోయిస్టులు కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులోభాగంగా, పూణె పోలీసులు విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్ష

Advertiesment
మా బెడ్రూం తలుపులు తెరచి పడుకోమన్నారు... ఇంటి చుట్టూ ఎర్రటి వస్త్రాన్ని కట్టారు...
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:07 IST)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేందుకు మావోయిస్టులు కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులోభాగంగా, పూణె పోలీసులు విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు వరవరరావుతో పాటు మరికొంతమంది పౌరహక్కుల నేతలను పూణె పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పూణెకు తరలించారు. అయితే, వీరందరినీ జైలులో ఉంచాల్సిన అవసరం లేదనీ కేవలం గృహ నిర్బంధంలో ఉంచితే సరిపోతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
 
ఫలితంగా గట్టి పోలీసు భద్రత మధ్య వీరిని తిరిగి వారివారి నివాసాలకు తీసుకొచ్చారు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న వీరికి భద్రతగా ఉన్న పోలీసుల నుంచి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. బెడ్రూ తలపులతో పాటు.. ఇంటి తలపులు తెరిచి పడుకోవాలనే ఆంక్షలను సెక్యూరిటీ సిబ్బంది విధిస్తున్నారు. 
 
దీనిపై మానవహక్కుల కార్యకర్త గౌతం నవలఖా జీవన సహచరి సబాహుస్సేన్ స్పందిస్తూ, పోలీసులు మమ్మల్ని బెడ్రూం తలుపులు తెరచి పడుకోమన్నాని ప్రకటించారు. మేం నిద్ర లేచినప్పటి నుంచి ఇంటి లోపల ఉన్న తమను పోలీసులు గమనిస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 
 
తమ ఇంటి బయట బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారని చెప్పారు. పోలీసులు మా ఇంటి చుట్టూ ఎర్రటి వస్త్రాన్ని కట్టి ఉంచి పోలీసులు నిఘా వేచి ఉంచారు... మమ్మల్ని బంధువులు, స్నేహితులు, ప్రజలు కలవకుండా నిరోధించారు... కనీసం బ్యాంకు పని చేయించుకునేందుకు గౌతం సహాయకుడిని కూడా లోపలకు అనుమతించలేదు అని సబాహుస్సేన్ ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరే... నా పెళ్లామే కావాల్రా నీకు... పట్టపగలే యువకుడి దారుణ హత్య