హీరో నందమూరి బాలకృష్ణ అంటే వై.యస్. జగన్మోహన్ రెడ్డికి అంత ఇష్టమా? జగన్మోహన్ రెడ్డి బాలయ్యబాబు ఫ్యానా? అంటే అవుననే విషయం తాజాగా పలు పుకార్లకు వేదిక అయ్యింది. సోషల్ మీడియా గతంలో ఎప్పడో జగన్ తాను బాలకృష్ణ సినిమాలు బాగా చూసేవాడినని చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. బాలయ్య బాబు సినిమా ‘సమర సింహారెడ్డి’ సక్సెస్ సునామీ సృష్టించిన సంగతి మనందరకీ తెలిసిందే.
దాదాపు రెండు దశాబ్దాలు క్రింత విడుదలైన ఈ ‘సమర సింహా రెడ్డి’ సినిమా కడపలో దాదాపు యేడాది పైగా నడిచి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘సమర సింహారెడ్డి’ గోల్డెన్ జూబ్లీ పూర్తిచేసుకుంటున్న సందర్భంగా బాలయ్య బాబు అభిమానుల సంఘం కడప జిల్లా అధ్యక్షుడి హోదాలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ఇచ్చినట్టు వైరల్ అవుతుంది. అయితే జగన్ అభిమానులు మాత్రం అది మార్ఫింగ్ ఫోటో అని ఎప్పుడూ జగన్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు ఇవ్వలేదని తెలియజేస్తున్నాయి.