మంగళగిరిలో ఓటమి లోకేష్‌కి ముందే తెలుసా? అందుకేనా..?

బుధవారం, 19 జూన్ 2019 (12:56 IST)
మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీచేసిన నారా లోకేష్‌కు ఓటమి తప్పదని చంద్రబాబు, ఇతర పార్టీ పెద్దలకు ముందే తెలుసు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు, లోకేష్‌ల మీద ట్విట్టర్లో విరుచుకుపడే విజయసాయి రెడ్డి మరోసారి చెలరేగిపోయారు.
 
మంగళగిరిలో ఓడిపోతానని లోకేష్‌కు ముందే తెలుసు. అందుచేత లోకేష్‌ చేత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయించలేదని పేర్కొన్నారు.  ఇప్పుడేమో గతంలో పార్టీ ఓటమికి కారణాలు తెలిసేవని, ఈసారి ఓటమికి కారణాలు తెలియటం లేదు అంటూ చంద్రబాబు కొత్త  డ్రామాలాడుతున్నారని విమర్శించారు విజయసాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఛీ.. మెట్రో రైలులో అమ్మాయిల ముందు ఏంటీ పని?