Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొరల ఆగడాలపై ప్రజల పోరాటం రుద్రంగి చిత్రం

Advertiesment
Dora- jagapatibabu
, సోమవారం, 26 జూన్ 2023 (17:15 IST)
Dora- jagapatibabu
జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమల రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రుద్రంగి'. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు డైలాగ్స్ రాసిన ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
 
ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..రుద్రంగి అనే ఊరిలో భీమ్ రావ్ దొర అణిచివేతకు ప్రజా తిరుగుబాటు ఎలా సమాధానం చెప్పింది అనేది ట్రైలర్ లో కనిపించింది. దొరల పెత్తనంలో ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను చూపించారు. నాటి తెలంగాణలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎదిరించిన ప్రజలు ప్రాణాలకు తెగించి ఎలాంటి సాససోపేత పోరాటం చేశారు అనేది సినిమాలో ప్రధానాంశంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వాలా తెలుస్తోంది. భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలాభాయ్ గా మమతా మోహన్ దాస్, మల్లేష్ గా ఆశిష్ గాంధీ పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బాహుబలి టోన్ రుద్రంగిలో కనిపించింది. సినిమా మేకింగ్ లో భారీతనం, దర్శకత్వ ప్రతిభ కనిపించాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రుద్రంగి ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంటుందనే సూచనలు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నాయి.
 
ఇక తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో ఇలాంటి భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రాన్ని నిర్మించడం ఒక సాహసమే అని చెప్పాలి. అలాంటి ప్రయత్నాన్ని చేశారు నిర్మాత డాక్టర్ రసమయి బాలకిషన్. సాంస్కృతిక సారథిగా తెలంగాణ ఉద్యమ పాటకు గొంతుగా మారారు రసమయి. ఈ చిత్రంలో ఆయన పాడిన పాట సినిమాకే ఆకర్షణ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉంగరం వల్ల శ్రీ సింహా కోడూరి జీవితంలోని మలుపులే భాగ్ సాలే సినిమా