Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు : సరిపోదా శనివారం ఈవెంట్ లో నాని

Nani- trailer event

డీవీ

, బుధవారం, 14 ఆగస్టు 2024 (10:12 IST)
Nani- trailer event
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. 
 
టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. 
 
webdunia
Kalyan Dasari DVV Danayya Sj Suryah Priyanka Mohan Nani Hanshitha Harshith
వివేక్ ఆత్రేయ 2.0 లోడ్ అయ్యింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్ ని రివిల్ చేస్తోంది. మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది, పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. 
 
నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అనిపించింది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్  ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది. 
 
మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్-వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.
 
అనంతరం నాని మాట్లాడుతూ, మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. 'నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం'. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం' అన్నారు,    
 
SJ సూర్య మాట్లాడుతూ, డి.వి.వి దానయ్య చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు. 
 
హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. చాలా రోజుల మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. నాని గారితో గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి' అన్నారు. 
 
నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ.. సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని, సూర్య కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్ బస్టర్' అన్నారు 
 
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ .. ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ చాలా బావున్నాయి, నాకు చాలా నచ్చాయి. నాని సూపర్ గా చేశారు. సూర్య సర్ స్వాగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 29 న ఫీస్ట్ వుంటుంది' అన్నారు. 
 
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ది ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టరుతో సమంత నిశ్చితార్థం?