Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే..- NBK107 ఫస్ట్ హంట్ వ‌చ్చేసింది

NBK 107 still
, గురువారం, 9 జూన్ 2022 (19:53 IST)
NBK 107 still
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌ టైనర్‌ రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందే ఈ చిత్రం నుండి ఫస్ట్ హంట్ (టీజర్) ని విడుదల చేసారు.
 
నిమిషం నిడివి గల ఈ ఫస్ట్ హంట్ టీజర్ హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, స్టన్నింగ్ ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అభిమానులు పండగ చేసుకునేలా వుంది. బాలకృష్ణ మాస్ యాటిట్యూడ్, స్వాగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌.. స్టైలిష్ గా వుంటూనే మాస్ ని అలరించేలా వుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తన అభిమాన హీరో బాలకృష్ణ పాత్రని మునుపటి కంటే పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసినట్లు టీజర్ చూస్తే అర్ధమౌతుంది.
 
టీజర్ (ఫస్ట్ హంట్) ఎలా వుందంటే..
ఫస్ట్ హంట్‌లో బాలకృష్ణ వేటాడే సింహంలా కనిపించారు. టీజర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా వున్నాయి.
 
మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ .. నా జీవో గాడ్స్ ఆర్డర్..
 
భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే..
 
నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా ..
 
ఈ మూడు డైలాగ్స్ మాస్ కి పూనకాలు తెప్పించేలా వున్నాయి. మొత్తానికి ఫస్ట్ హంట్ టీజర్ తో ప్రేక్షకులకు, అభిమానులకు అదిరిపోయే బహుమతి ఇచ్చారు బాలకృష్ణ. 
 
 ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
మ్యూజిక్ సెన్సేషన్  థమన్  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యవాణికి మద్దతిచ్చిన శ్రీరెడ్డి.. వాడుకుని వదిలేస్తారని చెప్పానుగా..