Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరుత్సాహపరిచిన వెంకటేష్ సైంథవ్ చిత్రం రివ్యూ రిపోర్ట్

sandhav latest

డీవీ

, శనివారం, 13 జనవరి 2024 (12:36 IST)
sandhav latest
విక్టరీ వెంకటేష్ నటించిన 75 వ సినిమా సైంథవ్. సంక్రాంతి సందర్భంగా ఈరోజే అనగా శనివారంనాడు విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవీజుద్దీన్ సిద్దకి, ముఖేష్ రుషి, శ్రద్దా శ్రీనాథ్, గెటప్ శీను తదితరులు నటించారు.
 
కథ:
ఇంధ్రప్రస్థ అనే స్టేట్ (కల్పిత ఊరు)లో అండర్ వరల్డ్ గ్రూప్ వుంటుంది. ఆ గ్రూప్ ముఖేష్ రుషి, నవాజుద్దీన్ సిద్దకి, జిష్ను సేన్ గుప్తా ఆధ్వర్యంలో నడుస్తుంది. వారిపని ఇంటర్ మీడియెట్ చదివే కుర్రాల్ళను విదేశాలకు పంపించి టెర్రరిస్టులగా  మార్చడం. ఆ గ్రూప్ లో పనిచేసే సైంథవ్ కోనేరు (వెంకటేష్) ఈ విషయంలో విభేదించి బయటకు వచ్చేస్తాడు. అలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. మరోవైపు సైంథవ్ కూతురుకి నరాలకు సంబంధించిన వ్యాధి వుంటుంది. చిన్నతనంలోనే సైంథవ్ భార్య తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరణిస్తుంది.
 
ఇక ఐదేళ్ళ తర్వాత అండర్ వరల్డ్ గ్రూప్ కు చెందిన కొన్ని కంటైనర్ లు సైంథవ్ వున్న ప్రాంతానికి వస్థాయి. అందులో ఆయుదాలు వుంటాయి. ఆతర్వాత సైంథవ్ పరిస్థితి తెలిసిన గ్రూప్ లోని ఒకడు సైంథవ్ కు ఓ ఆఫర్ ఇస్తాడు. ఇక్కడకు వచ్చిన కంటైనర్ లలో ఒకటి మిస్ చేస్తే నీ కుమార్తెకు వచ్చిన జబ్బు కోసం కావాల్సిన ఇంజక్షన్ పదిహేడు కోట్లు కావాలి కాబట్టి.. దాన్ని నీకు ఇస్తానంటాడు. ఏది నీకు దక్కాలంటే ముగ్గురిలో ఇద్దరినీ చంపాలని కండిషన్ పెడతాడు. ఆ తర్వాత సైంథవ్ ఏమి చేశాడు? తన కుమార్తె ను కాపాడుకున్నాడా? నీతి న్యాయం అని ఊరుకుున్నాడా? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ సినిమా కథ చాలా సీరియస్ నెస్ తో కూడింది. ఇంతకుముందు కమల్ హాసన్ చేసిన విక్రమ్, రజనీకాంత్ చేసిన జైలర్ తరహాలో వయెలెన్స్ మామూలుగా లేదు. ఈ సినిమా చూశాక పులినిచూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వుంది. చైల్డ్ సెంటిమెంట్ తో సినిమాను సక్సెస్ చేయాలనుకున్నదిబెడిసి కొట్టినందనే చెప్పాలి. ఎందుకంటే కామన్ మేన్ కు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో లేదు. పదిహేడు కోట్లు ఖరీదు చేసే ఇంజక్షన్ అనేది అంశం కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో వుంటుంది. 
 
గతంలో ఇంచుమించు ఇలాంటి తరహా జబ్బుగల పిల్లలు వుంటే తెలంగాణ లో అప్పటి ప్రభుత్వం ఒకరిద్దరి సాయం చేసిన సందర్భాలున్నాయి. దర్శకుడు ఇలాంటి అంశాన్ని తీసుకున్నాడు. కానీ కథనం మొత్తం సీరియస్ గా సాగడం, హింస ఎక్కువ కావడం చిత్రం చూసేవారికి కాస్త తలనొప్పిగా వుంటుంది. సంగీతపరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి.
 
చైల్డ్ సెంటిమెంట్, జబ్బు కథలు ఇంతకుముందు అజిత్ హీరోగా, చిరంజీవి హీరోగానూ వచ్చాయి. అందులో కొంత ఎమోషన్ భార్య భర్తల బాండింగ్ వుంటుంది. కానీ సైంథవ్ లో భార్య ఎవరో చూపించరు. శ్రద్దా శ్రీనాథ్ కూడా సైంథవ్ ఇంటి పక్కన వుండే గెటప్ శీను భార్య. అతనితో గొడవపడి ఈ పాప దగ్గరే వుంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా చిత్రంగా అనుపిస్తుంది. ఇది హీరో స్థాయిని దించినట్లుంటుంది. 
 
సైంథవ్ గా వెంకటేష్ నటన బాగానే వుంది. మిగిలిన పాత్రలలో విలన్లు బాగా నటించారు. సంభాషణల పరంగా పెద్దగా చెప్పడానికి లేవు. అయితే కొన్ని ఫార్మా కంపెనీలో ప్రజల జీవితాలతో ఆడుకునేవిధంగా వున్నాయని ఆమధ్య మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, హైదరాబాద్ లలో కరోనా టైంలో కొన్ని సంఘటనలు విన్నాం. విలన్లు అలాంటి కంపెనీలు నడిపి ఏ విధంగా కోటీశ్వరులు అవుతున్నారనేది చూపించారు.
 
ఇక ముగింపులో తన కుమార్తె తోపాటు ఎన్.జి.వో. అనే ఆర్గనైజేషన్ లో ఇలాంటి జబ్బువున్న వారిని కూడా సైంథవ్ ఎలాకాపాడి సమాజ సేవ చేశాడనేది దర్శకుడు ఇందులో చెప్పదలిచాడు. సంక్రాంతి అంటేనే సరదాగా కుటుంబంతో గడిపే సినిమాలు ప్రజలు చూస్తారు. ఇలాంటి సీరియస్ మూవీలు, వయెలెన్స్ మూవీని ఏ మేరకకు ఆదరిస్తారో ప్రేక్షకులకే తెలియాలి. 
రేటింగ్: 2/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇనయ సుల్తానా గ్లామర్ అవతార్..