Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవితాన్ని కాచివడపోసిన వెంకటేష్ ఏమన్నారో తెలుసా!

Venkatesh latest

డీవీ

, గురువారం, 11 జనవరి 2024 (16:38 IST)
Venkatesh latest
విక్టరీ వెంకటేష్ తన 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా చిట్ చాట్.
 
 వెంకటేష్ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. తన చుట్టూవున్న వారు కూడా అలాగనే వుండాలని సూచిస్తారు. మనం ఏది చేసినా పైవాడు మనల్ని ప్రేరేపించాలి. లేదంటే ఏదీ మనం చేయలేం. ఇది మీకు ఏదో వింత అనిపించవచ్చు.కానీ నిజం. అంటూ ఓ సంగతి చెప్పారు.
 
- నేను అమెరికా నుంచి ఇండియా వచ్చి బిజినెస్ రంగంలో వుండాలనుకున్నా. కానీ అనుకోకుండా నాన్నగారి వల్ల యాక్టర్ అయ్యాను. అసలు అలా అవుతానని ఊహించలేదు.

అదేవిధంగా నా సినిమా తొలి దశలో చాలా బాగా ఆడిన చిత్రాలున్నాయి. కొన్ని సినిమాలు 98 రోజులు వరకు థియేటర్లలో ఆడాయి. ఇంకో రెండు రోజులు ఆడితే వంద రోజులు అవుతుంది. కానీ ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఫ్యాన్స్ చాలా అప్ సెట్ అయ్యారు. నా సోదరుడు సురేష్ బాబుకు వేలాది మంది విన్నపం చేశారు. కానీ రెండు రన్ లు కొడితే సెంచరీ పూర్తయ్యేది. కానీ అది మన చేతుల్లో లేదు. ఏవో కారణాలు అలా చేయించాయి.
 
- అదే విదంగా నాకు కథలు చెప్పాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. నేను నడుచుకుంటూ వెళుతుంటే సార్.. అని పలుకరించి విష్ చేస్తారు. వారిని చూడగానే నేను తిరిగి విష్ చేస్తాను. నా దగ్గర కథ వుందని వినమంటారు. కానీ ఎందుకనే వినాలనిపించదు. ఒక్కోసారి ఒకరిని చూడగానే ఆగి.. చెప్పు అంటూ అడిగి మరీ వింటాను. అప్పుడు అలా ఎందుకు చేశాను. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? అనేది మన ఊహకు అందని సమాధానాలు.
 
- ఇక స్వామి వివేకానంద సినిమా చేయాలనుంది. గతంలోనూ చెప్పాను. కానీ ఆ కథ కొంత వరకే సెట్ అయింది. పూర్తికాలేదు. అది పూర్తయ్యాక ఆలోచిస్తా.
 
- నేను రమణ మహర్షి శిష్యుడిని. ఆయన్ను స్పూర్తిగా తీసుకున్నా. కానీ ఆయన బయోపిక్ లో నటిస్తారా అని చాలా మంది అడుగుతున్నాను. అంత పెద్ద మహానుభావుడి కథ నేను చేయలేను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి వల్ల డ్రాప్ అయ్యా - హనుమాన్ షూట్ లో అపశ్రుతులు : ప్రశాంత్ వర్మ