బాలకృష్ణ 'జై సింహా` రివ్యూ ... కొత్త సీసాలో పాత సారా...
ప్రతి యేడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం విడుదల కావడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ యేడాది కూడా "జై సింహా"తో బాలయ్య బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలైన బాలయ్య 102
నిర్మాణ సంస్థ : సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం : బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, మురళీమోహన్ తదితరులు.
సంగీతం : చిరంతన్ భట్
నిర్మాత : సి.కల్యాణ్
దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్
ప్రతి యేడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం విడుదల కావడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ యేడాది కూడా "జై సింహా"తో బాలయ్య బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలైన బాలయ్య 102 చిత్రం బాలకృష్ణకు సెంటిమెంట్‌గా ఉండే "సింహం" అనే సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు. లోగడ బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం', 'సింహా' చిత్రాల్లో నటించిన నయనతార ఇందులో హీరోయిన్‌గా నటించింది. మరి నయనతార సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందో లోదో ఓసారి పరిశీలిద్ధాం.
కథ :
విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రిలో గౌరి(నయనతార), ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్)ను చూపించడంతో కథ ప్రారంభమవుతుంది. తదుపరి సన్నివేశంలో నరసింహ(బాలకృష్ణ) తన చిన్న బిడ్డతో కూర్గ్, కేరళ ప్రాంతాలకు వెళతాడు. అక్కడ తన బిడ్డకు సరిపడే వాతావరణం లేదని తెలుసుకుని చివరకు తమిళనాడులోని కుంభకోణంకు వస్తాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రధాన ధర్మకర్త (మురళీమోహన్) పరిచయం అవుతాడు. ఆయన ఇంట్లోని పనికి చేరుతాడు. ఆలయ ఆర్చకులకు, పోలీసులకు జరిగిన గొడవల్లో నరసింహం తలదూర్చడమే కాకుండా, మధ్యవర్తిత్వం వహించి జిల్లా ఎస్.పితో అర్చకులకు క్షమాపణ చెప్పిస్తాడు. దాంతో ఎస్.పి..నరసింహంపై పగ పెంచుకుంటాడు.
ఆ ప్రాంతంలోనే అతిపెద్ద రౌడీగా ఉండే కనియప్పన్ సోదరుడిని చంపేస్తాడు. ఆ హత్యను నరసింహంపై మోపేందు ఎస్పీ కుట్ర పన్నుతాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఉరిశిక్ష పడిన ఖైదీ(అశుతోష్ రాణా).. నరసింహంను చంపాలనుకుంటుంటాడు. అందుకని మంచి అదునుకోసం వెయిట్ చేస్తుండగా నరసింహంకు ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అసలు ఎస్.పికి, నరసింహానికి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు గౌరి ఎవరు? గౌరికి, నరసింహంకు ఉన్న బంధం ఏంటి? వైజాగ్‌కు, నరసింహంకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అసలు నరసింహం తన కొడుకుతో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఎందుకు వెళుతుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స్టార్ హీరోలను చక్కగా డీల్ చేస్తారనే పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఈ సారి ఆయన నటించిన చిత్రం జై సింహాకి విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టే బాలయ్య పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది. అమ్ముకుట్టి పాటలో ఆయన వేసిన స్టెప్పులు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్, అక్కడక్కడా చెప్పే పంచ్ డైలాగులు, ఫ్యామిలీ సీన్స్ ఆకట్టుకున్నాయి. కథ కన్విన్సింగ్‌గా ఉంది. ముగ్గురు హీరోయిన్ల పాత్రలను కథలో చాలా చక్కగా చొప్పించారు. మాటలు మెప్పించాయి.
అలాగే, 'నరసింహా' పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలకృష్ణ మార్క్ ఫైట్లు .. డాన్సులు ఆయన అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఉన్నాయంటున్నారు. ఇక కొన్ని సన్నివేశాల్లో ఆయన నాన్ స్టాప్‌గా చెప్పే డైలాగ్స్ బాలయ్య అభిమానులతో విజిల్స్ వేయిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటనకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరనే అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. బాలయ్య సంక్రాంతి సెటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.