Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకుడు విజయభాస్కర్‌ చేసిన జిలేబి రుచిగా వుందా! రివ్యూ

Shivani Rajasekhar, srikamal
, శుక్రవారం, 18 ఆగస్టు 2023 (20:41 IST)
Shivani Rajasekhar, srikamal
దర్శకుడు విజయభాస్కర్‌ అంటే ఓ కొత్త ఒరవడి సృష్టించిన నువ్వేకావాలి, స్వయంవరం వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ఎందుకనో కొంత విరామం తీసుకున్నారు. ఇక తాజాగా మెగాఫోన్‌ పట్టి తన కుమారుడు శ్రీకమల్‌ను కథానాయకుడిగా పెట్టి ‘జిలేబి’ అనే ఆసక్తికరటైటిల్‌ పెట్టారు. శివానీ రాజశేఖర్‌ హీరోయిన్. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
కాలేజీ చదువుతూ హాస్టల్‌లో వుండే నలుగురు కుర్రాళ్ళు. హాస్టల్‌ వార్డెన్‌ ధైర్యం (రాజేంద్రప్రసాద్‌) వీరిని పరిశీలిస్తుంటాడు. అందులో కమల్‌ (శ్రీకమల్‌), జి.లక్ష్మీభారతి ఉరఫ్‌ జిలేబి (శివానీ రాజశేఖర్‌)తో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారే తరుణంలో బుజ్జి (సాయికుమార్‌ బబ్లూ) బాబీ (అంకిత్‌ కొయ్య), వాషింగ్టన్‌ (వైవా హర్ష) కమల్‌ లైప్‌లోకి వస్తారు. ఆ తర్వాత పరిణామాలు ఏమిటి? ఇక జిలేబి తండ్రి ఎం.ఎల్‌ఎ. రుద్రప్రతాప్‌ రానా (మురళీ శర్మ) వల్ల కలిగిన ఇబ్బందులు ఏమిటి? ఫైనల్‌గా వార్డెన్‌ ధైర్యం శ్రీకమల్‌ విషయంలో ఏం చేశాడు? అన్నది మిగిలిన కథ.
 
సమీక్ష:
దర్శకుడు విజయబాస్కర్‌ గ్యాప్‌ తీసుకున్నా నేటి ట్రెండ్‌కు తగినట్లు ఆలోచనలు వున్నాయనే కోణంలో కాలేజీ స్టోరీ తీసుకున్నాడు. అందుకు తగినవిధంగా నడిపే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి ఆ కోణంలో నవ్వించే ప్రయత్నం చేశాడు. గతంలో ఇలాంటి వచ్చినా సరికొత్తగా చేయాలని ట్రై చేశాడు.కథ మొదట్లో స్లోగా సాగడంతో ఓపిగ్గా చూడాల్సివస్తుంది. బాయ్స్‌ హాస్టల్‌లో జిలేబి రావడంతో కథ ఆసక్తికరంగా మారింది. 
 
సన్నివేశపరంగా డైలాగ్స్‌లు, సెటైర్‌ కామెడీ బాగానే డీల్‌ చేశాడు. యూత్‌ కోసం తీసిన ఈ సినిమా వారిని ఆకట్టుకునే ప్రయత్నం జరిగిందనేచెప్పాలి. ప్రథమార్థంలో అందరినీ పరిచయం చేయడంతో కాస్త డల్‌గా అనిపించినా సెకండాఫ్‌లో కథ వేగం అందుకుంది. హాస్టల్‌ వార్డెన్‌ రూమ్‌లను చెక్‌ చేసే సీన్లు కొత్తబంగారులోకం కంటే సరికొత్తగా చేయగలిగాడు. 
 
నటులపరంగా రాజేంద్రప్రసాద్‌ కొట్టిన పిండే. తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోగా శ్రీకమల్‌ మెప్పించే ప్రయత్నం చేశాడు. నటన బాగా డీల్‌ చేశాడు. మాడ్యులేషన్‌ బాగానే వుంది. శివానీ రాజశేఖర్‌ ఇంతకుముందు చేసిన పాత్రకు భిన్నమైంది. అందంగా కనిపిస్తుంది. నటన మెప్పిస్తుంది. మిగిలిన హీరో స్నేహితులు ఎంటర్‌టైన్‌ చేశారు.
 
సాంకేతికంగా చూస్తే మాటలు దర్శకుడుబాగా కేర్‌ తీసుకున్నాడు. వినోదానికి పెద్ద పీట వేశాడు. మణిశర్మ బాణీలు, రీరికార్డింగ్‌ ఓకే. సతీష్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువుబాగున్నాయి. చేతబడి సీన్‌ బాగా మెప్పిస్తుంది. విజయభాస్కర్‌ తన బ్రాండ్‌ను నిలబెట్టుకునే క్రమంలో కొడుకును హీరోగా పరిచయం చేసి సక్సెస్‌ అయ్యాడు. కథనంలో చిన్నపాటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి లేకుండా చూసుకుంటే మరింతగా ఆకట్టుకునేది.
రేటింగ్‌: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి విమర్శిస్తే బాధేస్తుందని : కార్తికేయ గుమ్మకొండ