Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

Advertiesment
HIT

దేవి

, గురువారం, 1 మే 2025 (12:27 IST)
HIT
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. 
 
ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. హిట్ పరంపరలో 3వ పార్ట్. నేడే విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం. 
 
కథ: ఎస్పీగా పదవి తీసుకున్న అర్జున్ సర్కార్ (నాని) సిటీకి దూరంగా క్రూరంగా మనుషుల్ని చంపే వారిని శోధించడానికి వెళతాడు. అయితే.. అసలు కిల్లింగ్ చేసింది అర్జున్ సర్కార్ అని తెలిసి అరెస్ట్ చేస్తారు. జైల్లో వేయగానే అతనిపై ఎటాక్ జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
మనిషిని హింసిస్తూ చంపడం అనేది సైకో బిహేవియర్. అంతకు మించి కత్తులతో నరకడం, లోపలి పార్ట్‌లు మాయం చేయడం ఈ కిల్లర్‌ పని. దీనికి డార్క్ వెబ్‌సైట్‌లో మెంబెర్స్ ఉంటారు. కానీ అది ఎందుకో జనాలకు ఎక్కలేదు. ఇందులో నాని  నిర్మాత, కం హీరోగా చేయడం పబ్లిసిటీ చేయడం జనాలు రావడానికి ఉపయోగపడింది. 
 
ఇక క్రూరంగా చంపడం అనే దానికి పేటెంట్ తీసుకున్నట్లుంది ఈ సినిమా. ఇలా చంపడం వెనుక మెడికల్ మాఫియా ఉంది. దేశదేశాల్లో బిలియనీర్ల అవసరమైన మనిషి భాగాలు ఎలా ఉపయోగించుకుంటారనేది పేపర్ కటింగ్ రూపంలో చూపారు. నాని హింస మామూలుగా లేదు. హీరోగా తనపరిదిని చూపించాడు.
 
కిల్లర్‌లో సైకోలు ఎలాంటరో చెప్పారు. అలాగే పోలీస్‌లో సైకో‌లు హిట్‌ పేరుతో ఉంటారని చెప్పారు. అది ఎలా అనేది సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇలా హింస చేయడం పురాణాల్లో చెప్పిన ఉపమానాలు చాగంటి ప్రవచనాలు చెప్పడం హీరోని వెలివేట్ చేశారు. దీనికి సీక్వెల్‌గా 4వ సినిమా వస్తుందని, కార్తి హీరోగా ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇందులో ఇద్దరు హీరోలు కూడా కనిపిస్తారు. సంగీతం, కెమెరా. బాగుంది.
 
రేటింగ్. 2.5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో