నటీనటులు: నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్
సాంకేతికత: సినిమాటోగ్రఫి: నికేత్ ,నమ్యూజిక్: వివేక్ సాగర్, నిర్మాత: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి దర్శకుడు: కిషోర్ ఈమాని బ్యానర్: న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
35 చిన్న కథకాదు అనే టైటిల్ ఏదో ఆసక్తిగా అనిపిస్తుంది. ఈ చిత్ర కథ స్కూల్ లో 35 మార్కులు కోసం కుర్రాడు ఏ విధంగా కష్టపడ్డాడు అనేది ముందుగానే నిర్మాత చెప్పేశాడు. మొదట్లో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ లో చేయాలనుకున్నారు. గేప్ రావడంతో మరో నిర్మాతకు కథ చెప్పాడు. అలా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ కథకు రానా సమర్పకుడిగా మారే స్థాయికి చేరుకుంది. మరి ఇంతగా ఈ సినిమాలో ఏముందో చూద్దాం.
కథ:
తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసే ప్రసాద్ (విశ్వదేవ్) సాంప్రదాయమైన బ్రాహ్మాణకుటుంబానికి చెందిన వాడు. 10వతరగి ఫెయిల్ అయిన మరదలు సరస్వతి (నివేదా థామస్) తో పెండ్లి జరుగుతుంది. ఇద్దరు కొడుకులతో జీవితం సాఫీగా సాగుతుంది. అయితే స్కూల్‌లో చదివే11 ఏళ్ల పెద్దబ్బాయి అరుణ్ శర్మకు అన్నీ అనుమానాలే. లెక్కల్లో చాలా పూర్. 5వ తరగతి వరకు కూడా లెక్కల్లో సున్నా మార్కులే వస్తాయి. స్కూల్ టీచర్ చాణక్య (ప్రియదర్శి) జీరో అని పిలుస్తాడు. మిగిలిన విద్యార్థులనూ మార్కులతో పిలుస్తంటాడు. అరుణ్ అడిగే ప్రశ్నకుల టీచర్ తోపాట పెద్దలు కూడా సమాధాన చెప్పలేరు. దాంతో టీచర్ అరుణ్ కు పనిషిమెంట్ ఇస్తాడు. దానికి బాధపడిన అరుణ్ తోటి స్నేహితుడితో కలిసి ఆయన బైక్ ను పంచర్ చేయడం వంటి పనులు చేస్తుంటాడు.
చివరికి స్కూల్ హెడ్ మాస్టర్ మనవరాలు అదే క్లాస్ లో జేరడంతో కాస్త ధైర్యం తెచ్చుకున్న అరుణ్ కు మరలా టీచర్, అరుణ్ ను డిగ్రేట్ చేసి కింద క్లాస్ కు పంపిస్తాడు. దీంతో అతని తల్లి దండ్రులు ఏమి చేశారు? ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
చిత్తూరు జిల్లాలో కథ జరగడంతో యాస కూడా అలానే వుంటుంది. కుర్రాడి తండ్రి విశ్వదేవ్ కు చిన్నకథకాదు అనేది ఊతపదం. కొడుక్కి 35 మార్కులు సంపాదించడమే అసలు కథ కాబట్టి దర్శకుడు చిత్రం పేరు 35 చిన్నకథకాదు అని పెట్టినట్లు తెలుస్తోంది. సహజంగా పిల్లలకు లెక్కలంటే భయం. చాలామందికి దాన్ని భూతంగా చూస్తారు. ఆ పాయింట్ ను తీసుకుని దర్శకుడు తనకున్న అనుభవాలతో సినిమాగా తీసినట్లు కనిపిస్తుంది.
చిన్నపిల్లల కథతో పెద్దలు కూడా ఆలోచించేలా చేసే సినిమాలు అసలు లేవనే చెప్పాలి. అలాంటిది కమర్షియల్ ఫార్మెట్ ఈ సినిమాను తీసిన నిర్మాతను అభినందించాలి. ఎప్పూడు వీడియోగేమ్స్, వాట్సప్ చూసే పిల్లలు ఇటువంటి సినిమాను చూసి భవిష్యత్ లో తాము ఏమి కావాలనేది స్పూర్తి కలిగిస్తుంది. ఎడిసన్ స్కూల్లో పూర్ విద్యార్థి. అలాంటి వాడిని టీచర్ అయిన అతని తల్లి మారుస్తుంది. ఆ పాయింట్ తో అరుణ్ తల్లి ఏవిధంగా కొడుక్కోసం నిర్ణయం తీసుకుందనేది బాగుంది. ఆమెకు గౌతమి పాత్ర స్పూర్తి కలిగించేదిగా వుంది.
తిరుపతి బ్యాక్ డ్రాప్ బాగుంది. దర్శకుడు కిషోర్ ఈమాని పిల్లలనుంచి నటన రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు బలంగా మారింది. అలాగే తల్లి పాత్రకు నివేదా థామస్‌ను, తండ్రి పాత్రకు విశ్వదేవ్ పాత్రలను ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ కొట్టాడని చెప్పవచ్చు. నివేదా థామస్ అన్నగా చేసిన నటుడు కాస్త ఎంటర్ టైన్ చేస్తాడు. ఎక్కడా కల్పిత సన్నివేశాలు లేకుండా సాఫీగా కథతోపాటు పాత్రలు ట్రావెల్ అవుతాయి. ప్రియదర్శి కళ్ళజోడు లేకుండా చూడలేకుండా పాత్ర డిజైన్ బాగుంది. హెడ్ మాస్టర్ గా భాగ్యరాజ్ పాత్ర నిడివి తక్కువే అయినా అది కేవలం మార్కెటింగ్ కోసం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. సరస్వతి పాత్రలో నిదేదా మానసిక సంఘర్షణను సహజసిద్దంగా తెరపైన చూపించారు. వి
సాంకేతికంగా నికేత్ సినిమాటోగ్రఫి చక్కగా ఉంది. తిరుపతిలో ఉండే దివ్యత్వాన్ని, అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. మంగ్లీ నేపథ్యం గానం సన్నివేశపరంగా వుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. క్లైమాక్స్‌లో సన్నివేశాలను అద్బుతంగా ఎలివేట్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సైకాలజీ, ఫన్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో రూపొందించిన చిత్రం ఈ సినిమాను పేర్కొనవచ్చు. కుటుంబంతో హాయిగా చూడతగ్గ సినిమా. చిల్రన్ ఫెస్టివల్ కు సరైన కథతో ఎంపికకు అర్హతమయ్యే సినిమాగా చెప్పవచ్చు.