Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు కొడైకెనాల్‌లో నానితో సంబరం- ఇప్పుడు సారంగపాణి జాతకం సెట్‌లో ప్రియదర్శితో సంబరం

Priyadarshi at the birthday celebrations on the sets of 'Sarangapani Jatakam'

డీవీ

, సోమవారం, 26 ఆగస్టు 2024 (17:06 IST)
Priyadarshi at the birthday celebrations on the sets of 'Sarangapani Jatakam'
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు తీసే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిది సూపర్ హిట్ కాంబినేషన్. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' వంటి విజవంతమైన సినిమాలు వాళ్లిద్దరి కలయికలో వచ్చాయి. వీరి కాంబోలో ఇప్పుడు హ్యాట్రిక్ సిద్దం అవుతోంది. ప్రియదర్శి కథానాయకుడిగా 'సారంగపాణి జాతకం' అనే సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా టైటిల్‌ను ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
'సారంగపాణి జాతకం' సినిమా సెట్‌లో ప్రియదర్శి బర్త్ డేను చిత్ర యూనిట్ సెలెబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ''చాలా రోజుల తర్వాత నేను బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అది కూడా సెట్ లో,  థాంక్స్ అందరికీ. ముఖ్యంగా మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి. ఇంతవరకు ఇలా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోలేదు. గొప్ప వ్యక్తుల మధ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ప్రత్యేకం. సహకరించిన మీ అందరికీ చాలా థాంక్స్. నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నా... మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ బ్యానర్ పేర్లు. కల నిజమైన క్షణం ఇది. నా కలను సాకారం చేసిన మా యూనిట్ ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అని అన్నారు.
 
నిర్మాత మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''మేం 'జెంటిల్‌మన్' సినిమా షూటింగ్ కొడైకెనాల్‌లో చేస్తున్నప్పుడు నాని గారితో ఇటువంటి సంబరం చేసుకున్నాం. మాకు మళ్లీ అటువంటి అవకాశం ఈ సినిమా చిత్రీకరణలో లభించింది. సినిమాను ఆల్మోస్ట్‌ ఫినిష్ చేశాం. అవుట్ పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం'' అని అన్నారు. 
 
మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''తెలంగాణ ఫాహద్ ఫాజిల్ ప్రియదర్శికి హ్యాపీ బర్త్ డే. అతను చేసే అన్ని సినిమాలు సక్సెస్ కావాలి'' అని అన్నారు. 
 
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ తంగలాన్