Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దంగల్' నటి వేధింపుల కేసు .. నిందితుడికి బెయిల్

'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చే

Advertiesment
Zaira Wasim molestation case
, గురువారం, 21 డిశెంబరు 2017 (10:20 IST)
'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
గతవారం విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఢిల్లీ నుంచి ముంబైకు వెళుతుండగా నటి జైరా వసీం పట్ల ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్‌దేవ్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి ఓ వీడియోను జైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 
 
దీన్ని సీరియస్‌గా తీసుకున్న పౌర విమానయానశాఖ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో సచ్‌దేవ్‌పై కేసు నమోదు చేసి, ఈ నెల 10న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఈనెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్ కంటే సన్నీలియోన్ అంటేనే ఎక్కువ గౌరవం: వర్మ.. సీన్లోకి కత్తి