Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవును మనం విఫలమయ్యాం.. హెల్త్ కేర్ సిస్టమ్ అలా వుంది: సోనూ సూద్

అవును మనం విఫలమయ్యాం.. హెల్త్ కేర్ సిస్టమ్ అలా వుంది: సోనూ సూద్
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (22:05 IST)
కరోనా కాలంలో రియల్ హీరోగా మారాడు సోనూసూద్. విలన్ పాత్రలు చేసినా హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. ఆపై పేదలకు తన వంతు సాయం అందిస్తూనే వున్నాడు. 
 
తాజాగా ఆయనకు కరోనా సోకినా.. సేవా కార్యక్రమాలను ఆపలేదు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పేద వ్యక్తి చేసిన విన్నపాన్ని మన్నించాడు. తన తండ్రి డయాబెటిక్ పేషెంట్ అని ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నాడు. ఆయన కోసం పాట్నా, బీహార్‌లో ఓ బెడ్ కావాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సమాధానంగా సోనూసూద్ ట్వీట్ చేశాడు. 
 
తనకు 570 పడకలు కావాలని అభ్యర్థన రాగా, అందులో తాను కేవలం 112 పడకలను ఏర్పాటు చేయగలిగానని వెల్లడించాడు. అలాగే 1477 రెమెడిసివర్ కోసం అభ్యర్థిస్తే.. కేవలం 18 మాత్రమే లభించాయని చెప్పాడు. అవును మనం విఫలమయ్యాం.. మన హెల్త్ కేర్ సిస్టమ్ అలా వుందని.. సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు రెమిడెసివిర్‌ దందా పెరుగుతుంది. హెటిరోలో కొనుగోలు చేసిన ఫార్మసీ నిర్వాహకులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
హెటిరోలో 5 వేలకు కొనుగోలు చేసి షాపులో 35 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. షేక్‌మజర్ నుంచి 6 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌మజర్‌ లంగర్‌హౌస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని జాగ్రత్తలతో సినిమా చూడండి