Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mohanlal: లూసిఫర్‌కు మించి మోహన్ లాల్ L2 ఎంపురాన్ వుంటుందా !

Advertiesment
Mohanlal - L2 Empuraan

దేవీ

, సోమవారం, 17 మార్చి 2025 (10:04 IST)
Mohanlal - L2 Empuraan
మోహన్‌ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది. 1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.  
 
webdunia
Mohanlal - L2 Empuraan
మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.
 
మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా తెరపైకి రాబోతోన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
 
సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ అఖిలేష్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా