Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహన్ లాల్ భారీ చిత్రం L2 ఎంపురాన్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్

Advertiesment
Prithviraj Sukumar first look

డీవీ

, బుధవారం, 16 అక్టోబరు 2024 (12:37 IST)
Prithviraj Sukumar first look
2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రాబోతోంది. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్‌లు నటిస్తున్నారు. తొలి భాగం హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహ‌న్ లాల్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి.
 
మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన జయేద్ మసూద్ కారెక్టర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
 
ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు. 
 
లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది. 2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 
న‌టీన‌టులు:మోహ‌న్ లాల్‌, టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి