Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎంకి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ వెళ్ల‌డం వెన‌కున్న సీక్రెట్ ఇదే..!

Advertiesment
సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎంకి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ వెళ్ల‌డం వెన‌కున్న సీక్రెట్ ఇదే..!
, గురువారం, 16 మే 2019 (14:09 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం. ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హ‌ర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క నైజాం ఏరియా లోనే 5 రోజుల్లో 19.01 కోట్ల రూపాయల రికార్డు షేర్‌తో దూసుకెళ్తూ మొదటి వారంలోనే మహేష్ గత చిత్రాల ఫుల్ రన్ రికార్డులని తిరగరాయనుంది. 
 
మహేష్ బాబు హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్‌కి వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకున్నారు. మ‌హేష్ క్రాస్ రోడ్స్ లోని థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూసి చాలా సంవ‌త్స‌రాలు అయ్యింది. అలాంటిది స‌డ‌న్‌గా సుద‌ర్శ‌న్ 35 ఎంఎంకి ఎందుకు వెళ్లిన‌ట్టు అనే సందేహం అంద‌రిలో. విష‌యం ఏంటంటే... మ‌హేష్ కెరీర్లో మెమొరబుల్ బ్లాక్ బస్టర్స్ అయిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు సుదర్శన్ 35 ఎంఎంలో ఎన్నో రికార్డులు సృష్టించాయి.
 
తాజాగా మహేష్ 25వ చిత్రం మహర్షి కూడా సుదర్శన్ 35 ఎం.ఎంలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా మహేష్ కంచుకోట అయిన సుదర్శన్ 35 ఎం.ఎంకి మ‌హేష్ వెళ్లి అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. త‌న సొంత ధియేట‌ర్ ఉన్నా... సుద‌ర్శ‌న్ ధియేట‌ర్ అంటే త‌న సొంత ధియేట‌ర్ అనే ఫీలింగ్ అని. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కాభిమానుంద‌రికీ ధ‌న్య‌వాదాలు అంటూ సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దడపుట్టిస్తున్న రష్మి గౌతమ్ "శివరంజని" ట్రైలర్