రెబల్ స్టార్ ప్రభాస్‌తో 2019లో సాహో చిత్రం చేశాక ఒక్కసారిగా దర్శకుడు సుజిత్ పేరు అందరికీ తెలిసింది. శర్వానంద్‌తో రన్ రాజా రన్ చిత్రం తర్వాత ఆయనకు ప్రభాస్‌తో వచ్చిన అవకాశం అది. ఆ సినిమా తర్వాత సుజిత్ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందనే అనుకుంది టాలీవుడ్. సాహో సినిమాను బాలీవుడ్‌ను కూడా ఆకర్షించింది. బాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.
టెక్నికల్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాహోకు చిరంజీవి అభినందలు దక్కాయి. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనేది ప్లాన్. అందుకు రంగం సిద్ధమైంది కూడా. మలయాళసినిమా లూసిఫర్ ను రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులుకు సుజిత్ సిద్ధం అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రానికి వినాయక్ లైన్లోకి వచ్చాడు. దాంతో స్క్రిప్ట్ దశలోనే సుజిత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి వరసపెట్టి నాలుగు సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కానీ సుజిత్‌కు అవకాశం మాత్రం అందులో ఏ ఒక్క సినిమాకూ రాలేదు.
అంతర్లీనంగా కొంతమంది పోకడవల్ల చిరంజీవి సినిమాలో తను తప్పుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద హీరోలకు కాంబినేషన్లు నిర్మాతలు చూస్తుంటారు. సాహో గొప్ప సినిమా అయినా అది కమర్షియల్‌గా అంతగా వర్కవుట్ కాలేదనీ టాక్ కూడా వుంది. ఆ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి సుజిత్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. మరి అది ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి.