Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు దేవరాజ్ పైన బుల్లితెర నటి శ్రావణి ఫిర్యాదులో ఏముందంటే?

Advertiesment
complaint
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:50 IST)
బుల్లితెర నటి శ్రావణి, దేవరాజ్ రెడ్డి అలియాస్ సన్నీ, వీరిద్దరి స్వస్థలం కాకినాడ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. తరుచుగా కాల్స్ చేసుకొని మాట్లాడుతుండటంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో శ్రావణి సహాయంతో అవకాశాల కోసం దేవరాజ్ హైదరాబాద్ వచ్చాడు. షూటింగ్‌లు లేని సమయంలో ఇరువురు కలుసుకునేవారు.
 
గత ఏడాది సెప్టెంబర్‌లో శ్రావణి ఇంట్లో ఉండేందుకు శ్రావణి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాడు దేవరాజు. శ్రావణి పేరెంట్స్ ఒప్పుకోవడంతో సెప్టెంబర్ 5వ తేదీన శ్రావణి ఇంట్లోకి వచ్చాడు. కొన్ని రోజులకే దేవరాజు అసలు రూపం బయట పడింది. దేవరాజ్‌కు చాలామంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు గుర్తించారు శ్రావణి కుటుంబ సభ్యులు.
 
అంతేకాదు అమ్మాయిలను ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించడం శ్రావణి కూడా గమనించింది. శ్రావణి పరిచయం కాకముందే వేరే అమ్మాయితో ప్రేమాయణం నడిపిన దేవరాజ్ ఆమెతో విభేదాలు రావడంతో శ్రావణితో ప్రేమాయణం నడిపాడు. దీంతో శ్రావణి దేవరాజ్‌ను దూరం పెట్టసాగింది. అయితే నాకు డబ్బులు అవసరం ఉందని 30 వేల రూపాయలు దేవరాజు అడగడంతో గూగుల్ పే ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసింది శ్రావణి.
 
రెండు రోజుల తర్వాత లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో 60 వేలు ఒకసారి, 40 వేలు ఒకసారి దేవరాజుకు శ్రావణి పంపించింది. అయితే మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో శ్రావణి నా దగ్గర డబ్బులు లేవనీ, ఇవ్వనని సమాధానం చెప్పింది.
 
అయితే శ్రావణికి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు ఫోటోలు తన దగ్గర ఉన్నాయని, చెప్పినట్టు వినకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలంటూ శ్రావణి వేడుకుంది. తనను కలవడానికి సీతాఫల్‌మండి వస్తేనే డిలీట్ చేస్తానంటూ దేవరాజ్ చెప్పడంతో అతని మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన శ్రావణిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు దేవరాజు. దీనితో ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది శ్రావణి. దేవరాజు మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఫిర్యాదు చేసింది శ్రావణి.
 
దేవరాజ్‌తో పరిచయమైనప్పుడు అతడితో ఎలా మాట్లాడింది?
గతంలో దేవ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన‌ వీడియో ఒకటి ఇపుడు హల్చల్ చేస్తోంది. అందులో శ్రావణి ఇలా మాట్లాడింది.

"నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి. 
ఎంతోమంది పరిచయమైనా నువ్ మాత్రమే స్పెషల్. 
నీలో నాకు ఎప్పుడూ మిస్టేక్ కనిపించలేదు. 
నా ఫ్యామిలీ మెంబర్‌లా నువ్ నాతో ఉన్నావ్. 
నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెప్తాను. 
నేను చాలాసార్లు విష్ చేశాను. 
నేను ఎవరికీ సారీ చెప్పను. నీకు మాత్రమే చెప్తున్నాను. 
నిన్ను ఏమన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనవ్. 
నాకు ఫోన్ చేయి అప్పుడపుడు"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రియ ''గమనం'' ఫస్ట్ లుక్ విడుదల.. గృహిణిలా అదిరే లుక్