Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

Advertiesment
UV creation letter

దేవీ

, గురువారం, 3 జులై 2025 (18:57 IST)
UV creation letter
UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెచ్చేలా కొందరు ప్రయత్నిస్తున్నారని వారిని ఉపేక్షించేదిలేదని చిత్ర నిర్మాతలు వంశీ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. ఒక అనామక వ్యక్తి తాను UV క్రియేషన్స్‌కు చెందినవాడినంటూ నటీమణులను, వారి ప్రతినిధులను తప్పుడు ఆఫర్లతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది.
 
ఈ వ్యక్తితో మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. UV క్రియేషన్స్ తరఫున వచ్చే అన్ని అధికారిక సమాచారం, కాస్టింగ్ ప్రక్రియలు నమ్మదగిన, సరైన మార్గాల ద్వారా మాత్రమే జరుగుతాయి.
 
ఈ విషయాన్ని పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలని, ఎవ్వరైనా ఈ తరహా అనామక ప్రతినిధులతో ముందుకు వెళ్లేముందు తప్పకుండా నిజం తెలుసుకోవాలని మనవి. మాకు ఏ అవసరాలు ఉన్నా లేదా కాస్టింగ్ కాల్స్ ఉన్నా, అవి అధికారికంగా, నమ్మదగిన వనరుల ద్వారా మాత్రమే తెలియజేస్తాం.
 
మా పేరు, బ్రాండ్‌ను దుర్వినియోగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !