Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలచందర్ స్ఫూర్తిగా తీసుకుని ముఖచిత్రం కథ సిద్ధం చేసాం : దర్శకుడు గంగాధర్, రచయిత సందీప్ రాజ్

director Gangadhar, writer Sandeep Raj
, బుధవారం, 7 డిశెంబరు 2022 (19:32 IST)
director Gangadhar, writer Sandeep Raj
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలు తెలిపారు సందీప్ రాజ్, గంగాధర్.
 
రచయిత సందీప్ రాజ్ మాట్లాడుతూ...లాకౌ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే  దాని ప్రస్తావన పదే పదే రాకుండా జాగ్రత్తపడ్డాం. టైమ్ రిలవెంట్ గా ఉండాలని ప్రయత్నించాం. నేను చదివిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఆధారంగా, నా అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాను. ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రమాదంలో గాయపడిన తన ప్రియురాలి ముఖానికి మరొకరి ముఖాన్ని అమర్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో నటించేందుకు కొత్త నటీనటులు, ఎలాంటి ఇమేజ్ లేని వారు కావాలని అనుకున్నాం. ఎందుకంటే పేరున్న వాళ్లు నటిస్తే...ఎవరు విలన్ ఎవరు మంచి వారు అనేది ప్రేక్షకులు గుర్తు పట్టేస్తారు. ప్రియా వడ్లమాని, అయేషా అద్భుతంగా నటించారు. పాండమిక్త ర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలనే చూసేందుకు వస్తున్నారు అని అంటున్నారు కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం. మా
చిత్రాన్ని విశ్వక్ సేన్ తో పాటు రవితేజ కూడా చూశారు. సినిమా చాలా బాగుందని వారు చెప్పిన మాటలు మాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అన్నారు.
 
దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ...నేను చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాను. పిల్ల జమీందార్,   భాగమతి సిినిమాలకు వర్క్ చేశాను. కోన వెంకట్ తో రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. దర్శకుడిగా సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో సందీప్ రాజ్ తో కలిసి ప్రాజెక్ట్ సెట్చే సుకున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాలో చాలా ఆసక్తికర అంశాలుంటాయి. మేం ట్రైలర్ లో చూపించింది కేవలం పది నిమిషాల కంటెంట్ మాత్రమే. మిగతాది థియేటర్లో ఎంజాయ్ చేయాలి. ఈ సినిమాలో ఒక న్యాయవాది పాత్ర ఉంది. అది కథకు చాలా ముఖ్యమైంది. ఆ పాత్ర కోసం విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని, టీజర్ రిలీజ్ కోసమని పిలిచి మేము చేసిన 70 పర్సెంట్ షూటింగ్  రష్ చూపించాం. అది చూసి ఆయన నేను ఈ సినిమా చేస్తాను అని మాటిచ్చారు. ముందే చెబితే ఒప్పుకోరని అలా చేశాం. విశ్వక్ పాత్ర సినిమాకు ఆకర్షణ అవుతుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఫిక్స్