Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Advertiesment
Rajesh danda, Bandla Ganesh, Kiran

చిత్రాసేన్

, మంగళవారం, 4 నవంబరు 2025 (12:14 IST)
Rajesh danda, Bandla Ganesh, Kiran
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సినిమా కె.ర్యాంప్ సక్సెస్ మీట్ లో గత రాత్రి నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్ తో కూడిన సెటైరిక్ స్పీచ్ సోషల్ మీడియాను ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఆవేశంగా గణేష్ మాట్లాడుతూ.. చిరంజీవిలా డౌత్ టు ఎర్త్ లా కిరణ్ అబ్బరం వున్నాడు. తెరపై నీ ఇష్టం వచ్చినట్లుండు. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం నీలా వుండు. సినిమా ఇండస్ట్రీలో వారసత్వాలుండవచ్చు. కానీ తెలీవీ అనేది వారసత్వంగా రాదు. కిరణ్ ఒక్కడే వచ్చి సక్సెస్ హీరోగా నిలబడ్డాడు. కిరణ్ ఇప్పటికి 6గురు కొత్తవారిని పరిచయం చేశారు. ఆయన్ను చూసి నేర్చుకోండి.
 
ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. లూజ్ ప్యాంట్ లు, చినిగిన బట్టలు, వాట్సప్ అంటూ వెరైటీగా మాట్లాడడం జరుగుతుంది. ఇక సక్సెస్ వస్తే చాలు.. నాకు రాజమౌళి, సుకుమార్, అనిల్ రావిపూడి, లోకేష్ కనకరాజ్ కాావాలంటూ పేర్లు చెప్పి మరీ అడుగుతున్న హీరోల కాలం ఇది. అందుకే కిరణ్ నీకు నువ్వులా వుండు. నువ్వు కొత్తవారికి అవకాశం ఇస్తున్నాం. ఇలా అందరూ వుండాలి. కొత్తవారు అవకాశం ఇవ్వకపోతే హీరోగా మీరు వుండేవారు కాదు. ఈ విషయాన్ని తెలుసుకోండి అన్నారు.
 
అలాగే నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ, మీడియా వాళ్లంతా మాకు మిత్రులే. కొన్ని మీడియా సంస్థల గురించి నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా, మా బ్యానర్ లో వరుసగా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. అంటూ అన్నారు.
 
దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ వుండదు.రిక్ వెస్ట్ లో వుంటాయి. రాజకీయాల్లో వార్నింగ్ లు వుంటాయి. అది గుర్తుపెట్టుకోండని సూచించారు. కె. రాంప్ సినిమా టైంలో సినిమా గురించి కొన్ని వెబ్ సైట్లు నెగెటివ్ గా వార్తలు రాశారు. దానిపై వారికి వార్నింగ్ ఇస్తూ గతంలో రాజేష్ మాట్లాడారు. అంటే నెల తర్వాత ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం